
ఇద్దరు దొంగలు అరెస్టు
చోరీసొత్తు స్వాధీనం
జయపురం: దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్టు జయపురం పట్టణ పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో జయపురం హటొపొదర్ వాసి రింకు బెనియ, జయపురం వాసి సుశాంత ఖండపాణి ఉన్నారని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్రరౌత్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి ఎనిమిది గ్రాముల బంగారు బిస్కెట్టు, ఒక జత బంగారు చెవి దుద్దులు, రెండు వెండి దీపపు కుందులు, రెండు వెండి ప్లేట్‌లు, ఒక వెండి చెంబు, రూ. 20 వేల నగదు, ఒక పల్సర్ బైక్, ఒక టాటా ట్రిగ్గార్ కార్, రెండు ఇనుప రాడ్లు, ఒక స్క్రూ డ్రైవర్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. జయపురం పట్టణ పోలీసు స్టేషన్ పరిధి పవర్ హౌస్ కాలనీ సమీప బికాశ్ బిద్యాలయ నివాసి బాబూజీ పట్నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల రెండో తేదీన హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో దొంగలు చొరబడి ఆస్తులను చోరీ చేశారు. ఈ నెల ఏడు తేదీన తమ ఇంటి పక్కన ఉంటున్న వారు తమకు ఫోను చేసి ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పట్నాయక్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే తాము జయపురం వచ్చి చూడగా ఇంటిలో దొంగతనం జరిగినట్లు గుర్తించి తమకు ఫిర్యాదు చేసినట్టు పోలీసు అధికారి వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. దొంగలు పట్టుబడినట్టు వివరించారు.

ఇద్దరు దొంగలు అరెస్టు