
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025
న్యూస్‌రీల్
నవీన్ పట్నాయక్ ఆరోగ్యం కోసం పూజలు
జయపురం: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ పట్నాయిక్ ఆరోగ్యం కుదుటపడాలని జయపురం బిజూ యువ జనతా దళ్ సభ్యులు సుప్రసిద్ధ గుప్తేశ్వర్‌లో మంగళవారం పూజలు నిర్వహించారు. పూజల్లో యువ బీజేడీ నేతలు బిశ్వజిత్ నాయిక్, ఘనశ్యామ్ నాయిక్, సత్య నాయిక్, పూర్ణ ఢాకువ, బాసు ఖండి, రాజా పాఢి, బాపి పండ తదితరులు పాల్గొన్నారు.
నిర్దోషిగా విడుదల
రాయగడ: ఒక గంజాయి సాగు కేసును విచారించిన గుణుపూర్ ఎస్‌డీజేఎం దేవదత్త పట్నాయక్ నిందితుడిని నిర్దోషిగా తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ మేరకు ఆయన తన తీర్పును వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి రామనగుడ సమితి డుమురి, డుమురిగుడ ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి సాగువుతుందన్న సమాచారం మేరకు 2016వ సంవత్సరం డిసంబర్ 3వ తేదీన గుణుపపూర్ పోలీసులు, అటవీ శాఖ, ఎకై ్సజ్ శాఖ సిబ్బంది దాడులు చేపట్టారు. 24 ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూమి, మరో 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రైవేటు స్థలంలో గంజాయి సాగుపై దాడులు చేపట్టి గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఈ మేరకు భగీరథీ సబర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసు గుణుపూర్ ఎస్‌డీజేఎం కోర్టులో సోమవారం విచారణకు వచ్చింది. కేసు విచారించిన న్యాయస్థానం నిందితుడు భగీరథిని నిర్దోషిగా తీర్పునిచ్చింది.
బోటు మునిగి ఒకరు గల్లంతు
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని బ్లాక్ గారబంద పోలీసుస్టేషన్ పరిధి లావణ్యగడ పంచాయతీలోని రాధా సాగరంలో మంగళవారం బోటు మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో ఉన్నటువంటి నలుగురిలో ముగ్గురు వ్యక్తులు ఈతకొట్టి ఒడ్డుకు చేరుకోగా ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో పెద్దహంస గ్రామానికి చెందిన లండ రామారావు (40)గా గుర్తించారు. పర్లాకిమిడి నుంచి ఓడ్రాఫ్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని రాధాసాగరంలో గాలించినా రామారావు ఆచూకీ లభించలేదని ఐఐసీ ప్రశాంత్ నిషిక తెలియజేశారు. రాధాసాగరం ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు చేరడంతో నిండుకుండలా మారింది. ఘటనపై గారబంద పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
చేతబడి నెపంతో వ్యక్తిపై దాడి
రాయగడ: చేతబడి నెపంతో ఒక యువకుడిపై దాడి జరిగిన ఘటన జిల్లాలోని శశిఖాల్ పోలీస్‌స్టేషన్ పరిధి బొడొలుకుటి గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. బొడొలుకుటి గ్రామంలో నివాసముంటున్న భాషా మండంగి అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడని అనుమానించిన గ్రామస్తులు జూలై 30వ తేదీన రాత్రి అతడి ఇంట్లో చొరబడి దాడి చేశారు. ఇంటి నుంచి ఈడ్చుకుంటూ వెళ్లి గ్రామం బయట ఒక చెట్టుకు కట్టేసి తీవ్రంగా గాయపరిచి విడిచిపెట్టారు. తీవ్రగాయాలకు గురైన భాషాను అతని కుటుంబ సభ్యులు జిమిడిపేట ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. అయితే తన భర్తపై కొందరు గ్రామస్తులు అమానుషంగా దాడి చేశారని ఆగస్టు 1వ తేదీన భాష భార్య చింతా కొండగిరి శశిఖాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన రామ కొండగిరి, గౌరి కొండగిరి, జగన్నాథ కొండగిరి అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం వారిని విడిచిపెట్టారు. ఇంటి వద్దే ఉంటూ గాయాలతో చికిత్స పొందుతున్న భాష ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ విషమించడంతో మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి అతని భార్య చికిత్స కోసం తరలించడంతో విషయం బయటపడింది. దాడి చేసినవారిని పోలీసులు అరెస్టు చేయకుండా ఎందుకు విడిపెట్టారో తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై పోలీసులు మౌనం వహిస్తున్నారు.
● మట్టి విగ్రహాల్లో దిట్ట అమలాభట్ట ● వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న 100 కుటుంబాలు
● వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలు లభ్యం
రాయగడ జిల్లా కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో అమలాభట్ట గ్రామం ఉంది. ఈ గ్రామంలోని సుమారు 100 కుటుంబాలు మట్టినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాయి. వీరు ప్రకృతిహితంగా విగ్రహాలను తయారు చేస్తుంటారు. కేవలం మట్టినే ఉపయోగించి అందమైన విగ్రహాలను తయారు చేయడంలో అమలాభట్ట గ్రామానికి ప్రత్యేకత ఉంది. ప్రతీ ఏడాది వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు వంటి ప్రత్యేక దినాల్లో విగ్రహాల తయారీలో ఇంటిళ్లపాది నిమగ్నమవుతుంటారు. ఈ ఏడాది కూడా వినాయక ఉత్సవాలకు సంబంధించి విగ్రహాల తయారీ ఊపందుకున్నాయి. మూడు నెలల ముందుగానే విగ్రహాలను రూపొందించడంలో నిమగ్నమైన యువతీ, యువకులు రేయింబవళ్లు కష్టించి విగ్రహాలను తయారీ చేస్తున్నారు. మూడు నెలల పాటు కష్టపడి పనిచేస్తే సుమారు రూ.50 వేల వరకు ఆదాయం ఒకొక్కరికీ లభిస్తుందని చెబుతున్నారు. అయితే గత మూడేళ్లుగా తమ వ్యాపారాలు చాలా మందకొడిగా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వినాయక విగ్రహాలకు సంబంధించి సహజ రంగులు ధరలు ఆకాశానంటుతుండడంతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్‌తో రూపొందించిన విగ్రహాల విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాలకు గిరాకీ తగ్గుతోందని చెబుతున్నారు.
బాల వినాయకులకు గిరాకీ
ఈ ఏడాది ఆర్డర్లు ఇచ్చేవారు బాల వినాయకుల ప్రతిమలకు అత్యంత ప్రాధాన్యమివ్వడంతో పాటు ఆర్డర్లకు అనుకూలంగా విగ్రహాలను తయారు చేస్తుండడం విశేషం. మువ్వగోపాలుడు, బాల వినాయకుడు వంటి వేషధారణల్లో ఈ ఏడాది వినాయకుల విగ్రహాలు దర్శనం ఇవ్వనున్నాయి. రాయగడ జిల్లాలోని గుణుపూర్, గుడారి, మునిగుడ, పద్మపూర్ వంటి ప్రాంతాలతో పాటు గజపతి జిల్లా నుంచి అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన మన్యం జిల్లా పార్వతీపురానికి చెందినవారు కూడా ఈసారి వినాయక విగ్రహాలకు ఆర్డర్లు ఇచ్చారు.
డైలీ మార్కెట్‌లో విగ్రహాలు
చిన్న చిన్న విగ్రహాలను ఈ గ్రామానికి చెందిన యువతులు రూపొందిస్తున్నారు. వాటిని స్వయంగా తయారు చేసి రంగులు అద్ది, పూర్తయిన తర్వాత చవితికి మూడు రోజుల ముందుగానే రాయగడ పట్టణంలోని మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ప్రతీ ఏడాది మహిళలు వినాయక చవితి సందర్భంగా కష్టపడి విగ్రహాల తయారీతో పాటు వాటిని విక్రయించి కొంతమొత్తం ఆదాయం సంపాదించుకుని కుటుంబ పోషణకు అండగా నిలుస్తుంటారు.
మెరుగులు దిద్దుకుంటున్న
వినాయక విగ్రహాలు
మువ్వగోపాలుడిగా
రూపొందుతున్న గణనాథుడు
వివిధ రూపాల్లో గణనాథులు
బాల గోపాలుడిగా గణపతి
బాల గణపతి విగ్రహం
గొంతెండుతోంది..!
మైనర్ బాలికపై అత్యాచారం
● నిందితుడి అరెస్టు
జయపురం: ఒక మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్ర రౌత్ వెల్లడించారు. అరైస్టెన వ్యక్తి స్థానిక గోపబందునగర్‌కు చెందిన రోహణ్ నాగ్ ఉరఫ్ రాజేంద్రగా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఒక వీధిలో నివాసముంటున్న మైనర్ బాలిక గత జూలై 10వ తేదీన తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు యువకులు వచ్చి ఆ బాలికను బలవంతంగా ఒక వాహనంలో తీసుకెళ్లిపోయారు. ఈ విషయం ప్రత్యక్షంగా చూచినవారు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో గాలించినా బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో జయపురం పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలించారు. అయినా ఆమె జాడ తెలియలేదు. ఎట్టకేలకు నవరంగపూర్ జిల్లా పపడహండిలో బాలిక ఉన్నట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలియడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ మైనర్ బాలికతో పాటు నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షలు నిర్వహించి వాగ్మూలం రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. మైనర్ బాలిక అపహరణ, అత్యాచారం జరిపిన నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఆందోళన చేపడుతున్న మృతుడి కుటుంబ సభ్యులు
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొరిగుమ్మ సమితి ఝొడొగుడ గ్రామం 26వ జాతీయ రహదారిలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. మరణించిన వ్యక్తి బొరిగుమ్మ సమితి కమతా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నారాయణ జానిగా గుర్తించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణ జాని తన మిత్రుడితో కలిసి బైక్‌పై బొరిగుమ్మ వైపు వస్తున్నారు. వారి వెనుక ఒక ప్రైవేట్ బస్సు వస్తూ బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వస్తున్న నారాయణ, అతడి మిత్రుడు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో నారాయణ జాని సంఘటనా స్థలం వద్దనే మరణించాడు. ప్రస్తుతం నారాయణ జాని బొరిగుమ్మ రాజ మేసీ్త్ర సంఘ కార్యదర్శి. నారాయణ ప్రమాదంలో మరణించినట్లు తెలిసిన వెంటనే రాజమేసీ్త్ర సంఘ సభ్యులు, అతడి బంధువులు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో 26వ జాతీయ రహదారికి ఇరువైపులా అనేక వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే బొరిగుమ్మ అదనపు తహసీల్దార్ సతీష్ కుమార్ బొయిని, పోలీసులు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అధికారులు ఇచ్చిన హామీలకు అంగీకరించి రాత్రి 8 గంటల సమయంలో ఆందోళన విరమించడంతో రాకపోకలు మరలా కొనసాగాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
రాయగడ జిల్లాలో కల్యాణ సింగుపూర్ సమితి సికరపాయి గ్రామంలోని లడొంగిరియా వీధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సికరపాయి నుంచి కల్యాణ సింగుపూర్, కాసీపూర్ తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వీధిలో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందరి దాహాన్ని తీర్చేందుకు ఒకే గొట్టపు బావి ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న బీడీవో సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే అందుకు వారు అంగీకరించకపోవడంతో, రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ చంద్ర జెన్న చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
– రాయగడ
ముందస్తు ఆర్డర్ల ప్రకారమే...
ఇదివరకు వినాయక చవితి దగ్గరపడుతుందంటే ఆరు నెలల ముందే విగ్రహాల తయారీకి సిద్ధమయ్యేవారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఆర్డర్లు బాగానే వస్తుండేవి. చేసిన వినాయక విగ్రహాలన్నీ దాదాపు అమ్ముడయ్యేవి. అయితే ప్రస్తుతం ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహాల విక్రయాలు జోరందుకోవడంతో వీరి వ్యాపారాలు మందకొడిగా మారాయి. మట్టినే నమ్ముకున్న వీరి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ప్రత్యేక దినాల్లో తప్పా మిగతా రోజుల్లో వ్యాపారాలు కొనసాగక ఇతర పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అందువల్ల గత రెండేళ్ల నుంచి ఆర్డర్లు వచ్చేంత వరకు మాత్రమే విగ్రహాలను కళాకారులు రూపొందిస్తున్నారు. మట్టినే నమ్ముకుని జీవనాధారంగా పలువురు ఏటా తీరైన మట్టి విగ్రహాలను రూపొందిస్తూ తమ జీవనాన్ని సాగిస్తూ పుడమిపై మమకారాన్ని చాటుకుంటున్నారు.
మనం చేసుకునే పండగలు వెనుక ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అవ్వడం. కానీ ఆధునిక పోకడలు పర్యావరణ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల్లో ఉపయోగిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్‌తో తయారు చేస్తున్న విగ్రహాలు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. దీనివలన జీవకోటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. అందువలన ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వినియోగించాలనే సంకల్పంతో అమలాభట్ట గ్రామస్తులు మట్టితో విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. వీటిని ఉపయోగించడం వలన పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇలా మట్టి మేలు తలపెడుతున్న వారిని ఒకసారి పలకరిస్తే...
– రాయగడ

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025