
విదేశీ మద్యంతో ఇద్దరు అరెస్టు
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ వారాంతపు మార్కెట్ వద్ద ఎకై ్సజ్, విజిలెన్స్ స్క్వాడ్ ఒక కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో 17 లీటర్ల 600 మిల్లీ లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కారు సీజ్ చేశారు. ఈ అక్రమ విదేశీ మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు బబులా సాహు, బిజయ్ చౌదరిలను ఎకై ్సజ్ అధికారులు అరెస్టు చేశారు. ఈ మద్యాన్ని గజపతి జిల్లాలోని నువాగడ, ఖోజురిపద, సెరంగో, నారాయణ్‌పూర్, కోయిపూర్, జిరంగో, రామగిరికి తరలిస్తున్నట్లు కటక్ ఎకై ్సజ్ కమిషనర్ పి.అన్వేషా రెడ్డి తెలిపారు. రాయఘడ లిక్కర్ హోల్‌సేల్ షాపు సీసీటీవీ ఫుటేజీని ఎకై ్సజ్ కమిషనర్ పరిశీలిస్తున్నారు. దాడుల్లో హీరా దళపతి, బ్రజ కిషోర్ బింధాని, ఎస్‌ఐ షేక్ షకువాల్, కానిస్టేబుల్ గౌరంగ నాయక్, పద్మినీ నాయక్, పవిత్రా కుమార్ దాస్‌లు ఉన్నారు. నిందితులను బుధవారం ఉదయం కోర్టులో హాజరు పరుస్తామని అబ్కారీ కమిషనర్ పి.అన్వేషా రెడ్డి తెలియజేశారు.