జీవనాధారం నీవేనయ్య..! | - | Sakshi
Sakshi News home page

జీవనాధారం నీవేనయ్య..!

Aug 20 2025 5:51 AM | Updated on Aug 20 2025 5:51 AM

జీవనా

జీవనాధారం నీవేనయ్య..!

జీవనాధారం నీవేనయ్య..! ● విగ్రహాల తయారీనే నమ్ముకున్న కళాకారులు ● స్థానికులతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాక ● ట్రెండ్‌కు తగ్గట్టు రూపుదిద్దుకుంటున్న విగ్రహాలు ● వారం రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు

ట్రెండింగ్‌కు అనుగుణంగా..

● విగ్రహాల తయారీనే నమ్ముకున్న కళాకారులు ● స్థానికులతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాక ● ట్రెండ్‌కు తగ్గట్టు రూపుదిద్దుకుంటున్న విగ్రహాలు ● వారం రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు

వజ్రపుకొత్తూరు రూరల్‌ :

వినాయక చవితి సందడి మరో వారం రోజుల్లో మొదలుకానుంది. భాద్రపద శుక్లపక్ష చవితి నాడు ప్రారంభమై నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవం ఈ నెల 27న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కళాకారులు విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. విగ్రహాలు తయారు చేసే కళను నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఏడాదికి ఒకసారి వచ్చే వినాయక చవితి ఉత్సవాలకు అవసరమైన బొజ్జ గణపయ్య విగ్రహాలను కళాకారులు తయారు చేసి ఏడాదికి సరిపడ ఆదాయాన్ని అర్జించి కుటుంబాన్ని పోషిస్తుంటారు. ప్రధానంగా ఈ సీజన్‌లో రాజస్థాన్‌, కోల్‌కత్తా, రాజమండ్రి తదితర ప్రాంతాలలో పాటు జిల్లాలో ఉన్న పొందూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, కాశీబుగ్గ, హరిపురం తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 200 విగ్రహా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కళాకారులు, వ్యాపారులు, కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఉత్సవాలకు మూడు నెలల ముందు విగ్రహాల తయారీ కేంద్రాలను ఎంపిక చేసుకొని అవసరమైన ముడి సామగ్రిని లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కోనుగోలు చేసుకొని సేకరించి నిల్వపెట్టుకున్నారు. రెండు నెలల ముందు విగ్రహాలను తయారీ చేయడం ప్రారంభించారు. ఉత్సవానికి సమయం దగ్గర పడటంతో విగ్రహాలకు తుది మెరుపులు దిద్దుతున్నారు.

ఏటా ట్రెండింగ్‌లో ఉన్న వినాయక విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది. పూజా కమిటీ నిర్వాహకుల అభిరుచికి తగ్గట్టుగా రకరకాల ఆకృతిలో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. 2 అడుగుల నుంచి 12 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలను తయారీ చేసి మార్కెట్‌లో అమ్మకాల కోసం సిద్ధం చేస్తున్నారు. విగ్రహాల మోడల్‌, సైజ్‌ బట్టి ఒక్కొక్క విగ్రహాన్ని రూ.2 వేల నుంచి రూ.20 వేల వరకు అమ్మకాలు చేస్తున్నారు. కళాకారులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి విగ్రహాలు తయారీ చేస్తున్నారు. అయితే తాము ఆశించిన స్థాయిలు విగ్రహాలు అమ్ముడుపోతేనే తమ కుటుంబ పోషణకు భరోసా దొరుకుతుందని, లేదంటే నష్టాలు చవిచూడాల్చిన పరిస్థితి ఏర్పడుతుందని కళాకారులు చెబుతున్నారు.

జీవనాధారం నీవేనయ్య..!1
1/1

జీవనాధారం నీవేనయ్య..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement