వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతీ ఏడాది చిన్న చిన్న విగ్రహాలను మహిళలమే రూపొందిస్తుంటాం. తయారీ పూర్తయితే రంగులు అద్ది వాటిని మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తుంటాం. రూ.10ల నుంచి రూ.100ల వరకు విగ్రహాలను రూపొందిస్తుంటాం. అయితే కొనుగోలుదారులు మా కష్టానికి తగ్గ ఆలోచించకుండా బేరసారాలు అడుతుంటారు. విక్రయాలు మందకొడిగా ఉంటే ఒకొక్కసారి గిట్టుబాటు ధర లేకపోయినప్పటికీ విక్రయించాల్సి వస్తుంది. ఒకవేళ అలా విక్రయించకపోతే పెట్టుబడి కూడా నష్టపోతాం.
– పొందూరు లక్ష్మి, అమలాభట్ట
షెడ్డు నిర్మిస్తే ప్రయోజనం
గ్రామంలో సుమారు వంద కుటుంబాలు మట్టినే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాయి. వర్షం వస్తే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. చేసిన విగ్రహాలు వర్షాలకు తడిచి పాడవుతున్నాయి. పాలిథిన్ ఖరీదు చేసి వర్షం కురిసే సమయంలో విగ్రహాలను కప్పుకోవాల్సి వస్తోంది. అదే గ్రామంలో అందరి కోసం షెడ్డు ఉంటే అంతా అక్కడే విగ్రహాలు తయారీ చేసుకునే అవకాశం ఉండేది. షెడ్డు లేకపోవడంతో ఎవరి ఇంట్లో వారే విగ్రహాలను తయారు చేసుకోవాల్సిన పరిస్థితి. భారీ వినాయకుల తయారీ కోసం బయట వేరొకరిపై ఆధారపడాల్సి వస్తోంది.
– వంజరాపు రాజేష్, అమలాభట్ట
అధికారులు దృష్టి సారించాలి
గత రెండేళ్లుగా వచ్చిన ఆర్డర్ల ప్రకారమే విగ్రహాలను రూపొందిస్తున్నాం. ఆర్డర్లు లేకుండా తయారు చేస్తే అవి విక్రయాలు జరగక నష్టపోవాల్సి వస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నా, వాటి ఆదరణే అధికమవ్వడంతో మా వ్యాపారాలు దె దెబ్బతింటున్నాయి. మట్టినే నమ్ముకున్న మా కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయి. జిల్లా యంత్రాంగం వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
– పి.వెంకటరావు, అమలాభట్ట
మహిళలమే రూపొందిస్తుంటాం
మహిళలమే రూపొందిస్తుంటాం