
మల్కన్‌గిరిలో భారీ వర్షం
మల్కన్‌గిరి : మల్కన్‌గిరిలో భారీ వర్షాలు పడుతున్నాయి. కలిమెల సమితి ఎంవీ 96 వంతెనపై 5 అడుగులు నీరు ప్రవహించడంతో మల్కన్‌గిరి–కలిమెల రహదారి పూర్తిగా నిలిచిపోయింది. కంగురుకొండ వద్ద కూడా వర్షం నీరు నిండి రాకపోకలకు అంతరాయం కలిగింది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సోమవారం జిల్లా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మోహనలో కుండపోత
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు దొంచి కొడుతున్నాయి. ఆదివారం నుంచి మోహన బ్లాక్‌లో కుండపోత కురుస్తోంది. దీని ప్రభావంతో శిరిసిపడ, తియ్యమా వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో నాలుగు గ్రామాలకు రవాణా, కమ్యూనికేషన్లు ఆగిపోయాయి. మోహనలో అత్యధికంగా 123.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఆర్.ఉదయగిరిలో 45.0 మిల్లీమీటర్లు, గుసానిలో 71.0, కాశీనగర్‌లో 11.8, పర్లాకిమిడిలో 28.0, రాయగడ బ్లాక్‌లో 22.4, గుమ్మాలో 34.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మల్కన్‌గిరిలో భారీ వర్షం

మల్కన్‌గిరిలో భారీ వర్షం

మల్కన్‌గిరిలో భారీ వర్షం

మల్కన్‌గిరిలో భారీ వర్షం

మల్కన్‌గిరిలో భారీ వర్షం

మల్కన్‌గిరిలో భారీ వర్షం