
కల్యాణ సింగుపూర్‌లో రైతుల ఆందోళన
రాయగడ: సకాలంలో ఎరువులు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సొమవారం కల్యాణసింగుపూర్‌లో గల ల్యాంప్స్ కార్యాలయానికి రైతులు తాళం వేశారు. ఎరువుల కోసం గంటల తరబడి ఎదురు చూసినా ల్యాంప్స్ అధికారులు పట్టించుకోవడం లేదని, ఎరువులను నల్ల బజారుకు తరలిస్తున్నారని ఆరోపించారు. సమితిలోని సుమారు 14 పంచాయతీలకు చెందిన వందలాది మంది రైతులు ఎరువుల కోసం ల్యాంప్స్ కార్యాలయం వద్ద పడిగాపులు కాసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం రహదారి వద్ద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో తహసీల్దార్, పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను బుజ్జగించారు. రైతు గుడ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఎరువుల పంపిణీ విషయంలో ల్యాంప్స్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, సకాలంలో రైతులకు ఇవ్వాల్సిన ఎరువులను ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని అన్నారు.
రైతులతో మాట్లాడుతున్న తహసీల్దార్

కల్యాణ సింగుపూర్‌లో రైతుల ఆందోళన

కల్యాణ సింగుపూర్‌లో రైతుల ఆందోళన