మల్కన్‌గిరిలో ముఖ్యమంత్రి వాయు ఆరోగ్య సేవా శిబిరం
భువనేశ్వర్: రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ముఖ్యమంత్రి వాయు ఆరోగ్య సేవా యోజన కింద ప్రత్యేక వైద్య సేవలు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా మల్కన్‌గిరి జిల్లా ప్రజలకు అధిక నాణ్యత ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు కటక్ శ్రీ రామ చంద్ర భంజ్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి నుంచి వైద్య నిపుణుల బృందం సోమవారం మల్కన్‌గిరి జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రికి బయల్దేరింది. ఈ వైద్య బృందంలో లాప్రోస్కోపీ శస్త్ర చికిత్స, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాలకు చెందిన నిపుణులు, సహాయకులు ఉన్నారు. ఈ బృందం 21వ తేదీ వరకు అక్కడే ఉండి ప్రత్యేక సేవలు, చికిత్సను అందిస్తుంది. మల్కన్‌గిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 250 మందికి పైగా రోగులు ఈ సేవ కోసం ముందస్తుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం.


