
ఎమ్మెల్యే తారాప్రసాద్‌పై దాడి
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 14వ తేదీన రాత్రి కొరాపుట్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే తారాప్రసాద్ పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ మీదుగా ర్యాలీ కొనసాగుతుండగా.. అదే సమయంలో అకస్మాత్తుగా అక్కడి బస్టాండ్‌లో కళాసీల సంఘం అధ్యక్షుడు కృష్ణ కులదీప్ అక్కడికి చేరుకున్నాడు. ఆయన ఒక్కసారిగా ఎమ్మెల్యేపై దాడి చేశాడు. దీంతో ఎమ్మెల్యే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే కృష్ణ కులదీప్‌ను చితకబాదారు. ఎమ్మెల్యే గన్‌మెన్ అతనిపై కొరాపుట్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితుడు కూడా పోలీస్‌స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేశాడు. తనపై ఎమ్మెల్యే తారాప్రసాద్‌తో పాటు అతని సోదరులు హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే తారాప్రసాద్‌పై దాడి