
ఆందోళనలో అన్నదాత
● వర్షాలు లేక ఎండిపోతున్న పొలాలు
● పంటలు బతికించుకునేందుకు రైతులకు తప్పని పాట్లు
వర్షాల జాడలేక పంటపొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. మరో 10 రోజుల్లో నాట్లు జరగకపోతే వరినారును పశువుల మేతగా వదిలేస్తాం. ప్రస్తుతం సుదూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చి నారును బతికిస్తున్నాం.
– టి.అప్పారావు, రైతు, జాడ గ్రామం
మూడు వారాలుగా వాన జాడే లేదు. రైతులంతా దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుని నారును బతికించుకుంటున్నాం. చెరువుల్లోనూ చుక్క నీరు లేదు. ఇలాగే కొనసాగితే ఈ ఏడాది వరి సాగు కష్టమే. – ఎం.చిరంజీవి,
రైతు, జాడ గ్రామం
జి.సిగడాం : వర్షాలు సకాలంలో అనుకూలించకపోవడంతో మెట్టు ప్రాంత రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరితో పాటు గోగు, మొక్కజొన్న, వేరుశనగ పంటలు ఎండిపోతుండటంతో వాటిని బతికించుకునేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. వేలాది రూపాయలు మదుపులు పెట్టి పంటలు వేసినా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అవస్థలు తప్పడం లేదు. ఆగస్టు నెల సగం పూర్తయినా వరుణుడి కరుణ లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. జి.సిగడాం, జగన్నాథవలస, వెంకయ్యపేట చెట్టుపొదిలాం, ఎస్‌పీఆర్‌పురం, జాడ, డీఆర్‌వలస, ముషినివలస, మర్రివలస, జి.సిగడాం తదితర ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి పైపులైన్లు పెట్టి పంటకు తడిపెట్టాల్సిన దుస్థితి దాపురించింది.

ఆందోళనలో అన్నదాత

ఆందోళనలో అన్నదాత

ఆందోళనలో అన్నదాత