
మొబైల్ నేత్రాలయ వాహనం ప్రారంభం
పర్లాకిమిడి: రాష్ట్ర ఖనిజ, వ్యాపార, రవాణాశాఖ మంత్రి బిభూతీ జెన్నా దేశాయి ఫౌండేషన్ ట్రస్టు ఏర్పాటు చేసిన విజన్ ఆన్ వీల్స్ అనే క్యాటరేట్, అంధులకు ఉపయోగపడే మొబైల్ వాహానాన్ని శుక్రవారం ప్రారంభించారు. సకల సౌకర్యాలు కలిగిన ఈ సంచార నేత్ర పరీక్ష మొబైల్ వ్యాన్ ద్వారా గజపతి జిల్లాలోని రాయఘడ, ఆర్.ఉదయగిరి సమితులలో 102 గ్రామీణ ప్రాంతాలలో అంధులకు, స్క్రీనింగ్ చేసి తదనంతరం ఆపరేషన్లకు శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్ ఆస్పత్రికి పేషెంట్లను తరలించనున్నట్టు దేశాయి ఫౌండేషన్ ప్రోగ్రాం మ్యానేజరు ప్రణవ్ ప్రతాప్ సింగ్ తెలియజేశారు. గజపతి జిల్లాలో ఈ విజన్ ఆన్ వీల్స్‌ను సి.సి.డి.స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి అడ్డాల జగన్నాథరాజు తీసుకువచ్చారు.

మొబైల్ నేత్రాలయ వాహనం ప్రారంభం