
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
మెళియాపుట్టి: మండలంలోని పెద్ద లక్ష్మీపురం గ్రామం వద్ద ఒక కారు అదుపుతప్పి కరెంట్ స్తంభానికి ఢీకొంది. వివరాల్లోకి వెళ్తే.. పలాస నుంచి చాపర గ్రామానికి దంత వైద్యుడు ఎన్.హరిప్రసాద్ ప్రతిరోజూ వస్తుంటారు. ఆయన ఎప్పటిలాగే గురువారం ఒడిశాలోని గారబంద మీదుగా వస్తుండగా, ఒక్కసారిగా కుక్క అడ్డంగా రావడంతో రహదారి పక్కనే ఉన్న కరెంటు స్తంభానికి ఢీకొని కారు ఆగిపోయింది. అయితే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడినట్లు వైద్యుడు హరిప్రసాద్ తెలిపారు.
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు
జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం ప్రధాన ఆలయంలో వారాహి అమ్మవారికి శ్రావణ మాసం నాలుగో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి, అమ్మవారికి అర్చనలు, దర్శనాలు, ఏకవార అభిషేకాలు, కుంకుమ పూజలు చేపట్టారు. అమ్మవారికి నూతన వస్త్రాలు, పిండి వంటలు సమర్పించి మొక్కులు తీర్చారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.