పర్లాకిమిడి: మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు సేవించడం జీవితం నాశనమవుతుందని ఎస్పీ జ్యోతింద్రనాథ్ పండా అన్నారు. జిల్లా నుంచి గంజాయి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతోందని, ఈ ప్రాంతంలో 0.5 శాతం మాతం గంజాయి వినియోగిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. స్థానిక సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో బుధవారం మత్తు పదార్థాల విముక్తి భారత్ అభియాన్ నిర్వహించారు. కలెక్టర్ మధుమిత, జిల్లా అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు, సబ్ కలెక్టర్ అనుప్ పండా, డీన్ (అగ్రికల్చర్) ఎస్.పి.నందా, డైరక్టర్ (అడ్మిషన్) దుర్గాప్రసాద్ పాఢి, సామాజిక భధ్రత, దివ్యాంగుల సాధికారత శాఖ అధికారి ఎల్.సంతోష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొందరు విద్యార్థులు చదువులో ఒత్తిడి వల్ల మాదకద్రవ్యాలైన గంజాయి, సిగరెట్లు, ఛరాస్ సేవనం వల్ల తాత్కాలిక ఉపశమనం కలిగినా తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వార్డెన్లు, అధ్యాపకులు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేయాలన్నారు. తాను యూట్యూబ్, ఇన్‌స్టామ్‌గ్రామ్ వేదికగా ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్నానని చెప్పారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీన్ రితీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ మధుమిత బీటెక్ (అగ్రికల్చర్)విద్యార్థులు ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.
మత్తు పదార్థాలతో జీవితం చిత్తు
మత్తు పదార్థాలతో జీవితం చిత్తు