
బీజేపీ జాతీయ అధ్యక్షుడితో రాష్ట్ర ప్రముఖుల భేటీ
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశంలో ఒడిశా అగ్ర నాయకత్వం భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రులు కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడా, మంత్రులు డాక్టర్ ముఖేష్ మహాలింగ్, గణేష్ రామ్‌సింగ్ ఖుంటియా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు సునీల్ బన్సాల్, వినోద్ తావ్‌డే సమన్వయంలో జరిగిన ఈ సమావేశంలో ఒడిశా అభివృద్ధి రోడ్ మ్యాప్, పార్టీ సంస్థాగత ప్రాధాన్యతలపై చర్చించారు. బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆరోగ్య శాఖ, అటవీ పర్యావరణ విభాగం, పట్టణాభివృద్ధి, యువజన వ్యవహారాలు, క్రీడలు, సాంస్కృతిక శాఖల మంత్రులు వర్చువల్‌గా సమావేశంలో పాలుపంచుకున్నారని ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా తెలిపారు.