
ఎన్నికలకు ముందే పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ
● మంత్రి రబీ నాయక్
భువనేశ్వర్: రాష్ట్రంలో పంచాయతీలను పునర్ వ్వవస్థీకరించాలని నిర్ణయించామని రాష్ట్ర పంచాయతీరాజ్, రక్షిత మంచినీటి విభాగం మంత్రి రబీ నాయక్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ ప్రతిపాదన మేరకు పంచాయతీలను బలోపేతం చేయడానికి 2027 సంవత్సరానికి ముందుగానే పునర్నిర్మిస్తామన్నారు. అలాగే 2029 సంవత్సరానికి ముందుగానే కొత్త మండలాలు ఏర్పాటు అవుతాయన్నారు. పంచాయతీరాజ్, తాగునీరు శాఖల సమీక్ష సమావేశంలో మంగళ వారం రాష్ట్ర గవర్నర్ పంచాయతీల పెంపు ప్రతిపాదించారన్నారు. పంచాయతీరాజ్ చట్టం కింద పంచాయతీని బలోపేతం చేయాలని గవర్నర్ ప్రతిపాదించారని మంత్రి తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తారన్నారు. వీటి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కమిటీ సిఫారసుల మేరకు కొత్త పంచాయతీలు, మండలాల రూపురేఖలు ఖరారు చేస్తారని మంత్రి వివరించారు.