సెంచూరియన్‌లో యోగోత్సవం
పర్లాకిమిడి:
ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ, మురార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (న్యూఢిల్లీ) ఆధ్వర్యంలో ‘యోగోత్సవం– 2025’ను జిల్లా కలెక్టర్ బిజయకుమార్ దాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డాక్టర్ సుప్రియా పట్నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, ప్రొఫెసర్ బిశ్వజిత్ మిశ్రా (పరిపాలన), డైరక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, క్రీడాశాఖ డైరెక్టర్ రబినారాయణ రౌత్రాయ్ తదితరులు హాజరయ్యారు. కలెక్టర్ దాస్ మాట్లాడుతూ యోగా ద్వారా మనిషి ఆరోగ్యం, జ్ఞానం కలుగుతుందన్నారు. సంపూర్ణ వెల్‌నెస్, నిరంతరం సెంచూరియన్ వర్సిటీకి సహాకారం అందిస్తున్నందుకు కలెక్టర్ బిజయకుమార్ దాస్‌కు ‘సెంచూరియన్ యోగా మిత్ర’ అవార్డును ఉపకులపతి ప్రొఫెసర్ సుప్రియా పట్నాయక్ ద్వారా ప్రదానం చేశారు. యోగాసనాలు చేసిన తరువాత రెండో సెషన్‌లో ‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ అనే వర్క్ షాపును ఐఐటీ ధాన్‌బాద్ నుంచి విచ్చేసిన ప్రొఫెసర్ అజిత్ కుమార్ బెహరా కుండలినీ యోగా గురించి విద్యార్థులకు తెలియజేశారు. భువనేశ్వర్ నుంచి విచ్చేసిన యోగాభ్యాసం కోచ్ అంశుమాలిని యోగా విద్య ద్వారా లాభాలను తెలియజేశారు. యోగా, ఽధ్యాన నైపుణ్య కోర్సులకు ఫెలిసిటేటర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ ప్రపుల్ల కుమార్ పండా, ఐ.కె.ఎస్ బోధకుడు బాలాజీ పాడీ, భువనేశ్వర్ క్యాంపస్ యోగా బోధకుడు డాక్టర్ జ్ఞానేంద్ర కుమార్ మిశ్రా, సెంటర్ కో ఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ సాహులకు జ్ఞాపికలతో డాక్టర్ అనితా పాత్రో అందజేశారు. ఎనిమిదో తరగతి విద్యార్థి మెహార్ సచిత్ చేసిన వేద ప్రార్థనలు, భగవద్గీత పారాయణంలో కర్మయోగ పద్యాలు పలువురుని ఆకట్టుకున్నాయి.
సెంచూరియన్‌లో యోగోత్సవం


