శరీర సౌష్టవ పరీక్షల్లో మరొకరు మృతి
పర్లాకిమిడి: గుమ్మా రోడ్డు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద గురువారం జరిగిన హోంగార్డ్స్ పోస్టుల భర్తీలో శరీర సౌష్టవ పోటీ పరీక్షల్లో మరో అభ్యర్థి దీపక్ పడాల్ (29) ఛాతీ నొప్పితో బరంపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలియజేశారు. మృతుడు దీనపక్ పడాల్ రాయఘడ బ్లాక్ నారాయణ్‌పూర్ గ్రామవాసి. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి దీపక్ పడాల్ కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ రూ.4లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేశారు. పర్లాకిమిడిలో రామగిరి పంచాయతీ పరిసల్ గ్రామానికి చెందిన సులాంత్ మిసాల్ (24) ఛాతీ నొప్పితో కుప్పకూలిన అనంతరం పర్లాకిమిడి ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
శరీర సౌష్టవ పరీక్షల్లో మరొకరు మృతి


