వివాహిత ఆత్మహత్య
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి భువనపల్లి పంచాయతీ గిన్నిపల్లి గ్రామంలో యోగి మాడీ (26) అనే వివాహిత సోమవారం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి భర్త ఎంక మాడీతో గొడవ అనంతరం అందరూ నిద్రపోయారు. ఆ సమయంలో పొలం పనుల కోసం తీసుకొచ్చిన పురుగుల మందును యోగి తాగింది. అర్ధరాత్రి వాంతులు రావడంతో గమనించిన భర్త వెంటనే ఆమెను ఎం.వి.79 ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రంలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చేందింది. ఐఐసీ చంద్రకాంత్ తండి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వైద్య శిబిరానికి విశేష స్పందన
జయపురం: స్థానిక దొలమండప వీధిలో వాగ్దేవి ఆంగ్ల పాఠశాల ప్రాంగణంలో ఆదివారం అఖిల భారత చిరంజీవి యువత జయపురం శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 295 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు సతీష్ రెడ్డి, ప్రసాద్ నల్లన, కె.సాయి తేజశ్విణి, ఎన్.ఎస్.సాయి అనూష, అఖిల భారత చిరంజీవి యువత ఒడిశా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వై.శ్రీనివాస ఖన్నా తదితరులు పాల్గొన్నారు.
చెట్టు పైనుంచి జారిపడి విద్యార్థి మృతి
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి హటోమునిగుడని రామక్రిష్ణ మిషన్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి చెట్టు పైనుంచి జారిపడి మృతి చెందాడు. సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో వంశీ దిసారి (15) ప్రాణాలు కోల్పోయాడు. మిషన్ ప్రాంగణంలోని మామిడి చెట్టు పైకి ఎక్కిన వంశీ కాలుజారి కిందపడిపోయాడు. సమాచారం తెలుసుకున్న మిషన్ నిర్వాహకులు అతన్ని బిసంకటక్‌లోని క్రిస్టియన్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి కుటుంబీకులకు సమాచారం అందించారు.
వివాహిత ఆత్మహత్య
వివాహిత ఆత్మహత్య


