పల్లెసభ నిర్వహించకుండా చెక్‌డ్యాం నిర్మాణం తగదు
● ఏడీఎంకు ప్రజల ఫిర్యాదు
రాయగడ: పల్లెసభ అనుమతి లేకుండా చెక్ డ్యాం నిర్మాణం కొనసాగుతుండడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్‌కు గ్రామస్తులు సోమవారం వినతిపత్రం ను సమర్పించారు. కొరాపుట్ జిల్లా పిపాల్‌పదర్ గ్రామపంచాయతీ పరిధిలోని కుటింగగుడ, షియాలిమాల్, బారిగాన్, పిపాల్‌పదర్, బగ్మారి, కందుపాయ్ గ్రామాలకు చెందిన ప్రజలు, అదేవిధంగా రాయగడ జిల్లాలోని కాసీపూర్ సమితి శంకరడ గ్రామ పంచాయతీలొని కరజొల, తయాపుట్, ఖాదికయోడి, కన్సారిగుడ, పుంజిగుమ్మ, శంకరడ, బార్‌కుతుమి గ్రామాలకు చెందిన ప్రజలు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. కాసీపూర్ సమితిలోని కన్సారిగుడలో నిర్మితం కానున్న ఆదిత్యా అల్యూమిన కంపెనీ కుటింగుడ గ్రామంలో చెక్ డ్యామ్‌తో పాటు పైప్‌లైన్ వేయడం వంటి పనులను కొనసాగిస్తున్నారు. గ్రామ సభ అనుమతి లేకుండా ఆయా పనులు ఎలా చేస్తున్నారని గ్రామస్తులు వినతిపత్రంలో పేర్కొన్నారు. తమ తమ గ్రామాల మీదుగా పారే నదిని చెక్‌డ్యాం నిర్మాణం ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దీని వల్ల తమ గ్రామాలకు ఆయా నది జలాలు అందక తాగు, సాగునీటికి కరువయ్యే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ పనులను నిలిపివేయాలని కొరారు.
పల్లెసభ నిర్వహించకుండా చెక్‌డ్యాం నిర్మాణం తగదు


