‘ఉపాధి’ పేరు మార్చడం తగదు
మల్కన్‌గిరి: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు తగదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. పేరు మార్చే విషయంపై పనరాలోచన చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరుతో రాసిన లేఖను జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రధానకు సోమవారం అందజేశారు. ఉపాధి పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఒక బిల్లును తీసుకువచ్చి భయంకరమైన నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం పాల్పడిందని దుయ్యబట్టారు. ఇది ఒక రాజకీయ కుట్రన్నారు. దీని లక్ష్యం ఒక చారిత్రాత్మకమైన, హక్కుల ఆధారిత ప్రజా సంక్షేమ చట్టం నుంచి మహాత్మాగాంధీ పేరు తప్పించడం న్యాయం కాదన్నారు. అదనపు కలెక్టర్‌ను కలిసినవారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు ఇతర నేతలు ఉన్నారు.


