ప్రజల వద్దకు పాలన
రాయగడ: సదరు సమితి జింగిలి గ్రామంలో సోమవారం ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీడీఓ సుజీత్ కుమార్ మిశ్రో, తహసీల్దార్ ప్రియదర్శిణి స్వయి హాజరై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై నాటకాన్ని ప్రదర్శించారు. జిమిడిపేట ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్ సుభ్రతా పండా ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అధికారులకు జంగిలి గ్రామస్తులు పలు సమస్యలను వివరించారు.
గ్రామానికి చెందిన 10 మందికి ఇళ్ల పట్టాలను, మరో ఐదుగురుకి మనొరేగ జాబ్ కార్డులు, మూడు స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. నలుగురుకి ఆయుస్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను అందజేశారు. ఏబీబీఓ కాలుచరణ్ నాయక్, సీడీపీఓ నళిని బైరాగి, ఏబీఈఓ బలరాం హుయిక, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల వద్దకు పాలన


