పోడియా సమితిలో ప్రబలిన వ్యాధులు!
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితిలో కొన్ని రోజులుగా వింత వ్యాధితో గిరిజనులు బాధపడుతున్నారు. అయితే ఏ వ్యాధి అనే విషయాన్ని ఇప్పటికీ వైద్యులు గుర్తించలేకపోయారు. వ్యాధి సోకిన వారు కిళ్ల నొప్పులు, జ్వరం, శరీరం పొంగిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. చిన్న పిల్లలు ఈ వ్యాధిబారిన ఎక్కువ మంది పడుతున్నారు. స్పందించిన ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా భవనేశ్వర్ నుంచి ఐఐఎంఆర్‌సీ బృందం పోడియా సమితికి శుక్రవారం చేరుకుంది. గ్రామాల్లో పర్యటించి ప్రజలు వినియోగిస్తున్న నీటిని పరీక్షించారు. దోమలగుడ్లను పరిశీలించి నమనాలు సేకరించారు. అలానే రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించారు. వీటిని భువనేశ్వరలోని మెడికల్ ల్యాబకి పంపించారు. పరీక్షల తరువాత రిపోర్టు వస్తే వ్యాధికి కారణాలు తెలుస్తాయని వైద్యాధికారులు వెల్లడించారు.
పోడియా సమితిలో ప్రబలిన వ్యాధులు!


