ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం | - | Sakshi
Sakshi News home page

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం

May 26 2025 12:27 AM | Updated on May 26 2025 12:27 AM

ఆదిత్

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం

శిష్టకరణ సంఘం కార్యదర్శిగా వీరపట్నాయిక్‌

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో సీఐడీ మాల గ్రామం వద్ద గల మామిడి తోటలో ఆదివారం జిల్లా శిష్ట కరణ సంఘం సమావేశం నిర్వహించారు. కార్యదర్శిగా ఆర్‌.వీరపట్నాయక్‌ను ఎన్నుకుని బాధ్యతలు అప్పగించారు. ఓఎస్‌ అధికారిగా పనిచేస్తున్న సిద్ధార్థ పట్నాయిక్‌ను సత్కరించారు.

రోడ్డు ప్రమాదంలో

గాయపడిన వ్యక్తి మృతి

ఎచ్చెర్ల: లావేరు మండలం తాళ్లవలస జాతీయ రహదారిపై ఈ నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సారవకోట మండలం చీడిపూడిక గ్రామానికి చెందిన షణ్ముఖరావు (30) ఆదివారం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనకాపల్లిలో తాపీ పని కోసం ఈ నెల 10న వెళ్తుండగా తాళ్లవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో షణ్ముఖరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్త రిమ్స్‌కు తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పశువుల తరలింపుపై కేసు నమోదు

ఎచ్చెర్ల క్యాంపస్‌: నవభారత్‌ జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారిపై పశువులను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 12 ఆవులు, 5 గేదెలను తీసుకెళ్తుండగా వీటిని పట్టుకున్నారు. తరలిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేశారు. అనంతరం పశువులను కొత్తవలస గో సంరక్షణ కేంద్రానికి తరలించారు.

శ్రీకాకుళం అర్బన్‌: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో వైశాఖ మాసం సందడి కొనసాగుతోంది. మూడో ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు, మొక్కుల్లో భాగంగా తలనీలాలు, వైశాఖ మాస ప్రత్యేక సంప్రదాయ పూజల్లో భాగంగా గ్రామీణ మహిళల ప్రసాదాల నివేదన తదితర ప్రత్యేక పూజలు విశిష్టతతో అరసవల్లి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆలయ ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ భారీగా భక్తులు తరలిరావడంతో ఈ సౌకర్యాలు పెద్దగా సరిపడలేదనే విమర్శలు వినిపించాయి. భానుడి ప్రతాపం తీవ్రంగా ఉండడంతో కేశఖండనశాల, ఇంద్రపుష్కరిణి పరిసరాలలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అంతరాలయంలో ప్రత్యేక అలంకరణతో స్వామివారిని సర్వదర్శనాలకు అనుమతించారు.

ఒక్కరోజులోనే రూ.12,29,751 ఆదాయం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ఒక్క రోజు ఆదాయం రూ.12,29,751 లభించింది. టికెట్ల రూపంలో రూ.8,84,100, పూజలు, విరాళాల రూపంలో రూ.81,496, ప్రసాదాల రూపంలో రూ.2,64,155 కలిపి మొత్తంగా రూ.12,29,751 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం 1
1/3

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం 2
2/3

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం 3
3/3

ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement