కుంధ్ర సమితిలో ధాన్యం కొనుగోలు మండీ ప్రారంభం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంధ్ర సమితి డొంగరచించి, పుప్పుగాం గ్రామాలలో శనివారం ధాన్యం కొనుగోలు మండీని అధికారులు ప్రారంభించారు. రెగ్యులేటింగ్ మార్కటింగ్ కమిటీ, ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సంస్థలు లేంప్స్, సివిల్ సప్‌లై కార్పొరేషన్ అధికారులు, మిల్లర్లు, రైతులు మండీల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రాధాబినోద సామంతరాయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మండీని ప్రారంభించగా.. లేంప్స్ మేనేజింగ్ డైరెక్టర్ పరశురాం మహారాణ, సివిల్ సప్‌లై ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ సెట్టి, రెగ్యులేటింగ్ మార్కెటింగ్ కమిటీ ధాన్య పరీక్షకులు డొంబురు శాంత, రైతు నేత రామనాథ్ భట్ పాల్గొన్నారు. ఈ రెండు మండీలలో నాలుగు వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.


