మంత్రముగ్ధం.. ఒడిస్సీ నృత్యోత్సవం
భువనేశ్వర్: స్థానిక రవీంద్ర మండపంలో అంతర్జాతీయ ఒడిస్సీ నృత్యోత్సవం ప్రారంభమైంది. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుతమైన ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధం చేశాయి. గురు కేలుచరణ్ ఒడిస్సీ పరిశోధన కేంద్రం, ఒడియా భాష, సాహిత్యం, సాంస్కృతిక శాఖ ఉమ్మడిగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నాయి. ఈ నెల 30 వరకు జరగనున్న 5 రోజుల ఈ ఉత్సవాన్ని సాంస్కృతిక శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ ప్రారంహించారు. ఆయన ముఖ్య అతిథిగా సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఒడిస్సీ నృత్యం రాష్ట్ర కళలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడంలో ఒడిస్సీ నృత్యం ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. కళా రంగంలో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన శక్తివంతమైన మాధ్యమంగా ఒడిస్సీని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యదర్శి దేవ ప్రసాద్ దాష్ మాట్లాడుతూ ఒడిస్సీ నృత్యం అంతర్జాతీయ స్థాయిలో ఒడిశాకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టిందని అన్నారు. ఐఐటీ భువనేశ్వర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు తమ బీటెక్ పాఠ్యాంశాల్లో ఒడిస్సీ నృత్యాన్ని చేర్చాయని, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఒడిస్సీ కేంద్రం కూడా స్థాపించబడిందని ఆయన తెలియజేశారు.
ఉత్సవం ప్రారంభ సాయంత్రం గురు కేలూ చరణ్ మహాపాత్రో ఒడిస్సీ పరిశోధన కేంద్రం నృత్యకారుల మంగళ చరణం ప్రదర్శనతో ప్రారంభమైంది. జయదేవుడి గీత గోవిందం నుంచి అష్టపదిని అందంగా ప్రదర్శించిన ప్రముఖ నృత్యకారుడు గురు బిష్ణుతత్త్వ దాస్ ఒడిస్సీ కచేరీ ఈ సాయంత్రం ముఖ్యాంశంగా నిలిచింది. అర్పితా పాణి, తులిక త్రిపాఠి, ప్రశాంతి జెనా మరియు ప్రభుతోష్ పండా సోలో, తన్మయ్ సమదర్, ఫర్జానా జాస్మిన్, జి. సంజయ్, డయానా ఘోష్ యుగళగీత, సంకల్ప ఫౌండేషన్ కళాకారులు సామూహిక ఒడిస్సీ ప్రదర్శనలు ఆహ్లాదపరిచాయి. కార్యక్రమంలో సాంస్కృతిక మంత్రి ఒడిస్సీ నృత్యం ఆధారంగా ‘ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఆర్ట్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్‘ శీర్షికతో కూడిన చిత్రకళ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రఖ్యాత కళాకారులు ఒడిస్సీపై సృష్టించిన చిత్రాలు ప్రదర్శించారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ ఒడిస్సీ నృత్య ఉత్సవంలో దాదాపు 350 మంది నృత్యకారులు పాల్గొంటున్నారు. వారిలో యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, మలేషియా వంటి విదేశాల నుంచి దాదాపు 15 మంది ఒడిస్సీ నృత్యకారులు ఉన్నారు. దేశంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, న్యూ ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, చత్తీస్‌గఢ్ నుంచి పులువురు కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు.
మంత్రముగ్ధం.. ఒడిస్సీ నృత్యోత్సవం
మంత్రముగ్ధం.. ఒడిస్సీ నృత్యోత్సవం
మంత్రముగ్ధం.. ఒడిస్సీ నృత్యోత్సవం
మంత్రముగ్ధం.. ఒడిస్సీ నృత్యోత్సవం
మంత్రముగ్ధం.. ఒడిస్సీ నృత్యోత్సవం
మంత్రముగ్ధం.. ఒడిస్సీ నృత్యోత్సవం


