31వ తేదీ వరకూ మంచుముప్పు
● ఐఎండీ మాజీ డైరెక్టర్ శరత్ చంద్ర సాహు
పర్లాకిమిడి: ఈ నెల 31వ తేదీ వరకూ పొగమంచు దట్టంగా కురస్తోందని ఐఎండీ డైరెక్టర్ శరత్ చంద్ర సాహు తెలిపారు. కొన్నిరోజులుగా కనిపించని పొగమంచు ప్రభావం తిరిగి శనివారం నుంచి గజపతి జిల్లా అంతటా దట్టంగా కురిసింది. పర్లాకిమిడిలో తెల్లవారు జాము నుంచి దట్టమైన పొగమంచు ఆవరించడంతో ఉదయం పది గంటల వరకూ సూర్యుడు కనపించడం లేదు. ఇక జిల్లాలోని ఏజెన్నీ ప్రాంతాల్లో ఉదయం 11 గంటల వరకూ మంచుప్రభావం తగ్గటం లేదు. దీంతో వాహనదారులు లైట్లు వేసుకొని వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. గజపతి జిల్లాలోని రాయఘడ బ్లాక్‌లో మర్లబ, రామగిరి, ఉదయగిరి, చంద్రగిరి, మోహానా, పాతపట్నం రోడ్డు, కాశీనగర్‌లో పొగమంచు విపరీతంగా కురవడంతో ప్రజలు వాహాన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. కాగా ఈనెల 31వ తేదీ వరకూ దక్షిణ ఒడిశాలో పొగమంచు కురుస్తుందని ఐఎండీ మాజీ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్ర సాహు తెలిపారు. అలాగే పశ్చిమ భారతం నుంచి చలిగాలుల ప్రభావంతో ఒడిశాకు కూడా చలి ప్రభావం ఉంటుందన్నారు.
31వ తేదీ వరకూ మంచుముప్పు


