ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాటాలు చేయాలి
జయపురం: ప్రజా సమస్యల పరిష్కారంపైన పార్టీ శ్రేణులు పోరాటాలు చేయాలని రాష్ట్ర కమ్యూనిస్టు కార్యవర్గ సభ్యులు, కొరాపుట్ జిల్లా పార్టీ కార్యదర్శి రామకృష్ణ దాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ నేత బుద్ర బొడొనాయక్ అధ్యక్షతన జరిగిన కమ్యూనిస్టు పార్టీ శత వార్షిక ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రామకృష్ణ దాస్ మాట్లాడారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకొనే స్థితి నెలకొందని, నిరుద్యోగం సమస్య ఆందోళన కలిగిస్తుందని, ధరలు రోజురోజుకూ పెరుగుతూ ప్రజలపై అధిక భారమతున్నాయన్నారు. దేశం రాజ్యాంగం విపత్కర స్థితిని ఎదుర్కొంటోందని దీనిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పార్టీ కార్యకర్తలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా మాజీ కార్యదర్శి జుధిస్టర్ రౌళో మాట్లాడారు. ఆర్.ఎస్.ఎస్, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌పై నిప్పులు చెరిగారు. కమ్యూనిస్టు నేతలు బసంత బెహరా, లయిచన్ ముదిలి, పబన్ మహురియ, తదితరులు ప్రసంగించారు.


