మేలుకొలుపు సందడి!
పర్లాకిమిడి: ధనుర్మాసం సందర్భంగా మేలుకొలుపు సందడి గ్రామాల్లో నెలకుంది. చలిని లెక్క చేయకుండా యువకులు, వృద్ధులు వేవెకువజామున మేళ తాళాలతో మేలుకొలుపు పాటలు పాడుకుంటూ కోమటి వీధి శ్రీవేంకటేశ్వర స్వామి మందిరానికి శనివారం వచ్చారు. స్థానిక ఖంజావీధి సాంస్కృతిక కమిటీ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా మేలుకొలుపు పాటలు పాడుతూ, ప్రజలు ఇచ్చేకానుకలు, బియ్యం తీసుకుంటారు. భోగి పండుగ వరకూ సాగే మేలుకొలుపులో ముఖ్యంగా శ్రీక్రిష్ణ చైతన్య ప్రభు నిత్యాగోవిందా.. మేలుకో.. అని పాడుకుంటు భక్తులకు ధనుర్మాసంలో మేలుకొలుపుతారు. దీంతో భక్తులు ఈ పాటలు విని తెల్లారిందని లేచి నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని శ్రీవేంకటేశ్వరుని స్వామిని దర్శించుకుని తమ పొలం పనులు, వ్యాపారాలకు వెళ్లడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఈ నెలరోజుల పాటు ఒక్కోక్క వీధి పాడుకుంటూ వెళ్ళి భక్తులు ఇచ్చిన కానుకలు భీష్మ ఏకాదాశి మరుచటినాడు ఖంజా వీధిలోలోని శ్రీత్రినాథ మందిరం వద్ద అన్నదాన సంతర్పణ చేస్తామని ఖంజావీధి సాంస్కృతిక మేలుకోలుపు కమిటీ సభ్యులు తెలిపారు. మేలుకొలుపులో చిన్నారులు కూడా పాల్గొని భక్తిభావాన్ని చాటకుంటున్నారు.


