ఉత్సాహంగా సిటిజన్ కమిటీ వనభోజనాలు
జయపురం: జయపురం సిటిజన్ కమిటీ శుక్రవారం ఉల్లాసంగా, ఉత్సాహంగా 2025 సంవత్సరం వనభోజనాలు జరుపుకుంది. జయపురం సమితి బముణిగాం గ్రామ మా శీతాలమ్మ గుడి ప్రాంగణంలో జరిగిన వనభోజన కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. సిటిజన్ సాధారణ కమిటీ కార్యదర్శి జి.వేంకట రెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులు భవాణి ఆచార్య, కార్యదర్శి రబినారాయణ నందో, దేవేంధ్ర బాహిణీపతి, పరమేశ్వర పాత్రోలు వనమహోత్సవాన్ని చక్కగా నిర్వహించి సభ్యులను ఆనంద పరిచారు. ఈ సందర్భంగా సిటిజన్ కమిటీ అధ్యక్షురాలు బినోదినీ శాంతపాత్రో సిటీజన్ కమిటీ నిర్వహిస్తున్న కార్యకలాపాలను వివరించారు. కమిటీ ని బలోపేతం చేసి ప్రజా సమస్యలపై మరింతగా ఉద్యమించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. తాను కేవలం పేరుకు మాత్రమే అధ్యక్షురాలునని సభ్యులందరి సహకారంతో విజయవంతంగా సిటిజన్ కమిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయని అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
కారు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొరాపుట్: కారు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. శనివారం కొరాపుట్ జిల్లా మాచ్‌ఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంత్రి పుట్ గ్రామానికి చెందిన ప్రశాంత్ ఖోర (35) ప్రమాదంలో మృతి చెందాడు. మాచ్‌ఖండ్ సమీపంలో ఒడి 10 బి 8411 నంబర్ గల కారులో వెళ్తూ మలుపు వద్ద అదుపు తప్పి స్తంభానికి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మాచ్‌ఖండ్ పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో బాలుడు..
రాయగడ: సదరు సమితి గుమ్మ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మృతుడు స్థానిక గౌతంనగర్‌కు చెందిన సింహాచల్ నాపాడు కుమారుడు అరుణ్ నాపాడు (7)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శుక్రవారం సింహాచల్ కుటుంబీకులు కాసీపూర్ వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా గుమ్మ వద్ద ఫొటోలు తీసుకుంటున్న సమయంలో బాలుడు అరుణ్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన అరుణ్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖపట్నానికి మెరుగైన చికిత్సకు రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యలోనే అరుణ్ చనిపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేశారు. అనంతరం సదరు పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాటు పడవ మునిగి వ్యక్తి..
కొరాపుట్: నాటు పడవ మునిగి ఘటనలో అందులో ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి బిరాపుట్ గ్రామ పంచాయతీ లంబదురో గ్రామానికి చెందిన రామ పంగి (30) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. జోలాపుట్ రిజర్వాయర్‌లో నాటు పడవ మీద వెళ్తుండగా అదిమునిగిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం రిజర్వాయర్‌లో గాలిసి రామ పంగి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్సాహంగా సిటిజన్ కమిటీ వనభోజనాలు
ఉత్సాహంగా సిటిజన్ కమిటీ వనభోజనాలు


