వేర్వేరు సంఘటనల్లో నలుగురు జల సమాధి
భువనేశ్వర్: రాష్ట్రంలో రెండు వేర్వేరు సంఘటనలలో నలుగురు బాలురు జల సమాధి అయ్యారు. ఆదివారం ఆయా ప్రాంతాల్లో విషాదం అలుముకుంది. కటక్, నయాగఢ్ జిల్లాల్లో ఈ విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. నయాగఢ్ జిల్లా దస్‌పల్లా పోలీస్ ఠాణా పరిధి గోడిబిడ గ్రామంలో ముగ్గురు బాలురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరు ముగ్గురు చెరువులో స్నానం చేస్తూ దురదృష్టవశాత్తు నీట మునిగారు. బాలురును బహదఖల పొడా సాహికి చెందిన 9 ఏళ్ల శుభ ఖిలార్, ఉమాకాంత్ నాయక్, నువాగాంవ్ పోలీస్ ఠాణా పరిధిలోని ఖలమడ గ్రామానికి చెందిన 11 ఏళ్ల ఏళ్ల రితేష్ ప్రధాన్‌గా గుర్తించారు. ఈ ముగ్గురినీ వెలికి తీసి దసపల్లా మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడికి చేరుకునే లోపే వీరంతా మరణించారని వైద్యులు ప్రకటించారు.
కఠొజొడి నదిలో బాలుడు గల్లంతు
కటక్‌లోని ఖాన్ నగర్ సమీపంలోని కఠొజొడి నదిలో కొట్టుకుపోయి 14 ఏళ్ల మైనర్ బాలుడు సూర్యకాంత్ మాఝీ గల్లంతయ్యాడు. నగరంలోని బేతాబింధాని సాహికి చెందిన సూర్యకాంత్ స్నానం చేస్తుండగా బలమైన ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి బాలుని గాలించి ఖాన్ నగర్ రైల్వే వంతెన సమీపంలోని నది నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వేర్వేరు సంఘటనల్లో నలుగురు జల సమాధి


