
సాధించాడు
మన గణేశుడు
● డొంకలపర్త వాసి అరుదైన రికార్డు
● సముద్రంలో 28 కిలోమీటర్ల దూరాన్ని 10.30 గంటల్లో ఈదిన వైనం
● తెలుగు రాష్ట్రాల నుంచి పారా స్విమ్మర్‌గా చారిత్రాత్మక ఘనత
ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్‌గా పనిచేస్తున్న బూర్జ మండలం డొంకలపర్త గ్రామానికి చెందిన బలగ గణేష్ రాష్ట్రంలో తొలి పారా స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించారు. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారతదేశంలో ధనుష్కోటి వరకు 28 కిలోమీటర్ల దూరాన్ని పది గంటల 30 నిమిషాల్లో ఈది తెలుగు రాష్ట్రాల నుంచి తొలి పారా స్విమ్మర్‌గా నిలిచారు. శుక్రవారం ఉదయం 5.50కు ప్రారంభించిన ఈ ప్రయాణాన్ని సాయంత్రం 4.20 గంటలకు పూర్తి చేశారు. ఈ అసాధారణ రికార్డుపై స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్ ప్రతినిధులు, శాప్ ఎండీ గిరీశ పీఎస్, డొంకలపర్త గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
– సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం

సాధించాడు