ఘనంగా..
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకుల పిలుపు
రాయగడ: బిజూ పట్నాయక్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించిన బీజేడీ నాయకులు
పర్లాకిమిడి: హైస్కూల్ జంక్షన్ వద్ద బిజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎమ్మెల్యే రూపేష్
రాయగడ: ర్యాలీలో మాజీ మంత్రి జగన్నాథ సరక తదితరులు
రాయగడ: బిజూ జనతాదళ్ పార్టీ 29వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ మంత్రి జగన్నాథ సరక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కొత్త బస్టాండు వద్ద గల బిజూ పట్నాయక్ విగ్రహానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జగదీష్ పాత్రో, అనసూయా మాఝి, జిల్లా పరిషత్ సభ్యులు ధబళేశ్వర్ నాయుడు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలొ పాల్గొన్నారు. అనంతరం ఊరేగింపుగా స్థానిక బిజూ ఆడిటోరియానికి చేరుకున్నారు.
పర్లాకిమిడిలో...
బిజేడీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం
పర్లాకిమిడి: బిజూ జనతాదళ్ పార్టీ 29వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పర్లాకిమిడిలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక హైస్కూల్ జంక్షన్ వద్ద దివంగత బీజేడీ నేత బిజూ పట్నాయక్ విగ్రహానికి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రేణులు నీలమ్మ గుడి వెనుక ఉన్న పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలువేసి ప్రసంగించారు. పార్టీ హయాంలో ఒడిశా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించిందని, తిరిగి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీజేడీ జయకేతనం ఎగురవేస్తుందని గుసాని సమితి జిల్లా పరిషత్ సభ్యులు ఎస్.బాలరాజు అన్నారు. సమావేశంలో పురపాలక శాఖ చైర్మన్ నిర్మలా శెఠి, జెడ్పీఅధ్యక్షు లు గవర తిరుపతిరావు, కాశీనగర్ బ్లాక్ అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రదీప్‌నాయక్, యువజన అధ్యక్షులు శాసనం లింగరాజు పాల్గొన్నారు.
కొరాపుట్: రాష్ట్రవ్యాప్తంగా బీజేడీ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. నబరంగ్‌పూర్ జిల్లా చందాహండిలో మాజీ ఎంపీ రమేష్ చంద్ర మజ్జి నేతృత్వంలో దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మజ్జిగూడ జంక్షన్ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారీ నివాళులర్పించారు. కొరాపుట్ జిల్లాలో మాజీ ఎంపీ జిన్ను హిక్కా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పీతం పాడీ, రఘురాం పొడాల్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా..
ఘనంగా..
ఘనంగా..
ఘనంగా..
ఘనంగా..


