పీఎం రాష్ట్రీయ బాలపురస్కార్ ప్రదానం
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ పెక్కట గ్రామానికి చెందిన జోత్స్న శోబోరో (17) అనే వెయిట్‌లిఫ్టర్ శుక్రవారం న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 అందుకుంది. ఆమెతో పాటు మరో 20 మంది కూడా రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ బహుమతి ప్రదానోత్సవంలో కేంద్ర మహిళా, శిశు వికాస్ మంత్రి సావిత్రీ ఠాకుర్, రాష్ట్ర మహిళా,శిశువికాస్ మంత్రి అన్నపూర్ణ దేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ క్రీడాకారిణికి కలెక్టర్ మునీంద్ర హానగ, జిల్లా స్పోర్ట్స్ అధికారి త్రినాథ సాహు, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి తదతరులు అభినందనలు తెలిపారు.
పీఎం రాష్ట్రీయ బాలపురస్కార్ ప్రదానం


