ిపిప్పిలిలో బాంబు దాడి
భువనేశ్వర్: పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో శుక్రవారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కొణాస్ కొలాపొదొర్ గ్రామంలో భూ వివాదం కారణంగా బాంబు దాడి జరిగినట్లు సమాచారం. స్థానిక పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
హిందువులకు
సంఘీభావంగా ర్యాలీ
కొరాపుట్: బంగ్లాదేశ్‌లో హిందువులకు సంఘీభావంగా ర్యాలీ జరిగింది. శుక్రవారం కొరాపుట్ జిల్లా బందుగాం సమితి అలమండ గ్రామంలో యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ దేశంలో హిందువులపై దాడులు అరికట్టాలని నినదించారు. అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొవ్వొత్తులతో అలమండ గ్రామ వీధులు, మైయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు.
ఒడిశాలో ప్రధాన ఎన్నికల కమిషనర్
● నేటి నుంచి 3 రోజుల పర్యటన
భువనేశ్వర్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ అధికారిక రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. శనివారం నుంచి వరుసగా 3 రోజుల పాటు నిరవధికంగా పర్యటించి బూత్ స్థాయి అధికారులతో సమావేశం కానున్నారు. ఈ నెల 27 తొలి రోజు పర్యటనలో భాగంగా సీఈసీ పూరీ సందర్శించి శ్రీ జగన్నాథుని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమం పూర్తి కావడంతో కోణార్క్ సూర్య దేవాలయం సందర్శిస్తారు. మరుసటి రోజున (డిసెంబర్ 28) ఆయన వారసత్వ గ్రామం రఘురాజ్‌పూర్, ధౌలి శాంతి స్థూపం, ఖండగిరి, ఉదయగిరి గుహలు, ముక్తేశ్వర్ ఆలయం సందర్శిస్తారు. ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వ విద్యాలయం (ఓయూఏటీ) ఆడిటోరియంలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు)తో కీలక సమావేశానికి అధ్యక్షత వహించి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్శన రాష్ట్రంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంకేతంగా పలు వర్గాలు భావిస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కింద దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా నవీకరణ చురుగ్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎల్‌ఓలతో సీఈసీ ప్రత్యక్షంగా సమావేశం కావడం ఓటర్ల జాబితా నవీకరణ క్షేత్రస్థాయి కార్యకలాపాల ప్రేరణకు సూచనగా తెలుస్తోంది.
పర్లాకిమిడి: పురపాలక సంఘం పరిధిలోని ఆరో నంబర్ వార్డు సేరి రెల్లివీధిలో కాయగూరలు అమ్మే బొమ్మాళి బోడెమ్మ కూతురు ఎస్.సరస్వతి ఇల్లు శుక్రవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని బాధితురాలు తెలిపారు. ప్రమాదంలో ఆమె ఇంటిలో దాచుకున్న రూ. 3 లక్షల నగదు, ఇంటి పట్టా పత్రాలు, దుస్తులు కాలిపోయాయని తెలియజేసింది. సరస్వతీ ఇంటికి తగిలి విద్యుత్ శాఖ సర్వీసు వైరు సరఫరా అవుతోంది. ఎన్నో సార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదుచేసినా సంబంధిత శాఖ ఇంజినీర్లు తగు చర్యలు చేపట్టలేదు. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత అగ్నిమాపక దళం ఫైర్ ఆఫీసర్ ధీరేంద్ర కుమార్ దాస్, రబీంద్ర బెహారా వెంటనే విచ్చేసి మంటలను ఆపే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి సేరిరెల్లి వీధికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆమెకు ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయానికి ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే రూపేష్ హామీ ఇచ్చారు.
ిపిప్పిలిలో బాంబు దాడి


