బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా బార్ అసోసి యేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికా రి సీహెచ్ బాబా యుగంధర్, సహాయ అధికా రి కిషోర్ పట్నాయక్‌లు ఈ కార్యక్రమం నిర్వహించారు. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సిరాజుద్ధీన్ అహ్మద్, కార్యదర్శిగా తపన్ సింగ్, ఉపాధ్యక్షుడిగా సదాశివ సాహు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.
పర్లాకిమిడిలో ఉపవాస దీక్షలు
పర్లాకిమిడి: చైత్రమాసం సందర్భంగా పర్లాకమిడి పట్టణంలో మాకాళీ దోండోనచో ఉపవాస దీక్షలు రెండు రోజులుగా జరుగుతున్నాయి. సాయంత్రం వేళ వివిధ వీధుల్లో గాలిదోండో, పాణిదోండో విన్యాసాలు కాళీ సాధకులు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకూ ఉత్సవాలు, సాంస్కృతి కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఫైనల్స్‌లో పంజాబ్ లవ్లీ
విశ్వవిద్యాలయం గెలుపు
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో జరుగుతున్న మూడో అఖిల భారత విశ్వవిద్యాలయాల స్టూడెంట్స్ పార్లమెంట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ ముగింపు సమావేశాలలో బహుమతి ప్రదాన సభకు ముఖ్యఅతిథిగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని మాట్లాడారు. నేటి మహిళలు భాగస్వామ్యులు మాత్రమే కాదు... మార్పునకు మార్గదర్శులు కూడా అని అన్నారు. నాలుగు రోజుల పాటు సాగిన వివిధ విశ్వవిద్యాలయాల గర్ల్ స్టూడెంట్స్ పార్లమెంటులో పంజాబ్ లవ్లీ యూనివర్సిటీ చాంపియన్స్‌గా నిలవగా, ద్వితీయ బహుమతి బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్సిటీ, సంత్‌గడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం తృతీయ బహుమతి గెలుచుకున్నారు. వారికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష బహుమతి ప్రదా నం చేశారు. కార్యక్రమంలో సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్.రావు, ఆంధ్రప్రదేశ్ సెంచూరియన్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ పి.కె.మహంతి, వీసీ బిశ్వజిత్‌లు జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించారు. భువనేశ్వర్ సెంచూరియన్ వర్సిటీ ఉపకులపతి డా. సుప్రియా పట్నాయిక్ బహుమతి ప్రదానోత్స వంలో పాల్గొన్నారు.
రెండు కేజీల గంజాయితో ముగ్గురు అరెస్టు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో 2 కేజీల 140 గ్రాముల గంజాయితో ముగ్గురు వ్యక్తులను పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు తెలిపా రు. ఇచ్ఛాపురం సీఐ కార్యాలయం ఆవరణంలో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన లక్ష్మికాంత్ బలియార్, అతని బావ మోహన్‌దాస్‌ప్రదాన్‌లు ఆర్థిక పరి స్థితి బాగులేకపోవడంతో గంజాయి వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో లక్ష్మికాంత్ గంజాయిని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో విక్రయించి వచ్చిన మొత్తాన్ని సమానంగా పంచుకునేవారు. ఈ క్రమంలో అక్కడి గంజాయి వ్యాపారి షాహాజి రామజాదవ్‌తో సికింద్రాబాద్‌లో పరిచయం ఏర్పడింది. తనకు కిలో గంజాయి అందజేస్తే రూ.7500 చెల్లిస్తానని చెప్పడంతో గంజాయి కొనుగోలు చేసి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్దకు వచ్చారు. వీరితో పాటు అక్కడికి వచ్చిన రామజాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మిస్టర్ ఆంధ్రా పోటీల్లో
సిక్కోలు హవా
శ్రీకాకుళం న్యూకాలనీ: మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ పోటీల్లో శ్రీకాకుళం బాడీబిల్డర్లు సత్తాచాటారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం నిర్వహించిన మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో కవిటి చెందిన దుదిస్టీ మజ్జి 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచారు. ఎస్.వైకుంఠరావు(శ్రీకూర్మం) 60 కేజీల విభాగంలో 4వ స్థానం, కె.అవినాష్ (పలాస) తదితరులు రాణించారు. వీరిని భీమవరానికి చెందిన ఎమ్మెల్యే అంజిబాబు, సంఘ రాష్ట్ర అసోసియేట్ సెక్రటరీ వి.విజయ్ బహుమతులు అందజేశారు. వీరిని శ్రీకాకుళం జిల్లా సెక్రటరీ కె.గౌరీశంకర్, అధ్యక్షులు తారకేశ్వరరావు, చీఫ్ పేట్రన్ డాక్టర్ బాడాన దేవభూషణ రావు, వడ్డాది విజయ్‌కుమార్, బలగ ప్రసాద్, సీనియర్ బాడీబిల్డర్లు, జిమ్ నిర్వాహకులు, కోచ్‌లు అభినందించారు.
బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం
బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం


