మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
కొరాపుట్: రోడ్డు ప్రమాద బాధితులను నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ఆదుకుని మానవత్వం చాటుకున్నారు. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా నందాహండి సమితి వైపు ఎమ్మెల్యే వెళ్తున్నారు. అదే సమయంలో కుంటియా జంక్షన్ వద్ద బైక్ యాక్సిడెంట్ జరిగి ఇద్దరు క్షతగాత్రులు రోడ్డు పక్కన తోటలో పడి ఉన్నారు. ఇది గమనించిన ఎమ్మెల్యే తన వాహనం నిలిపి వారి వద్దకు వెళ్లి మంచినీరు తాగించారు. వెంటనే పోలీసులకు, జిల్లా కేంద్ర ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. అత్యవసర వాహనం 112లో వారిని ఆస్పత్రికి పంపించారు.
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే


