వంశధార నది దాటిన జంట ఏనుగులు | - | Sakshi
Sakshi News home page

వంశధార నది దాటిన జంట ఏనుగులు

Apr 2 2025 12:43 AM | Updated on Apr 3 2025 1:18 AM

వంశధా

వంశధార నది దాటిన జంట ఏనుగులు

భామిని: మండలంలోని బిల్లుమడ రైతులు ఊపిరి పీల్చుకున్నారు. భామిని మండలం బిల్లుమడకు చేరిన జంట ఏనుగులు ఘీంకరిస్తూ మంగళవారం వంఽశధార నదిని దాటాయి. ఇప్పటికే ఒడిశా గ్రామాల్లో మరో రెండు ఏనుగుల జట్టు వీడిన రెండు ఏనుగుల జంట కోసం పాకులాడుతున్నట్లు తెలిసింది. వంశధార నదీ తీరంలోని ఒడిశాకు చెందిన పురిటిగూడ–గౌరీ గ్రామాల మధ్య రెండు ఏనుగుల జంటలు కలిసి ఊరట చెందాయని స్థానిక రైతులు తెలిపారు.

రజక సంఘం పట్టణ నూతన కమిటీ ఎంపిక

విజయనగరం టౌన్‌: ఉమ్మడి విజయనగరం, జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో విజయనగరం పట్టణ నూతన కమిటీ ఎంపిక మంగళవారం కార్యాలయంలో నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడిగా కోనాడ పైడిచిట్టి, ఉపాధ్యక్షుడిగా రామనేంద్రపు సురేష్‌, కార్యదర్శిగా కొవ్వూరి అప్పలరాజు, సహాయ కార్యదర్శిగా ముత్యాల సతీష్‌, కోశాధికారిగా జంపా నాగరాజు, కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో అప్పికొండ సన్యాసిరావు, తంగేటి భాస్కరరావు, జంపా చిన్న, మడిపల్లి రాజారావు, సురేష్‌, శంకర్‌, రాజా, సురేష్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

100 సారా ప్యాకెట్లు స్వాధీనం

పార్వతీపురం రూరల్‌: పట్టణ పోలీసులు తనిఖీల్లో భాగంగా పట్టణంలో గల పాత రెల్లివీధిలో వంద సారా ప్యాకెట్లతో మీసాల శివకుమార్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు టౌన్‌ ఎస్సై గోవింద మంగళవారం తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో వలస కార్మికుడి మృతి

సీతంపేట: మండలంలోని కిల్లాడ గ్రామానికి చెందిన వూయక రాహుల్‌ (20) అనే గిరిజన యువకుడు వలస వెళ్లి అక్కడ విద్యుత్‌ షాక్‌తో రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకుని కొద్ది నెలల కిందట మచిలీపట్నం వలసవెళ్లాడు. అక్కడ చేపల చెరువుకు కాపలాగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే గతనెల 31న చేపలచెరువుకు వెళ్లి పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మరణించాడు. కుమారుడి మృతివార్త విన్న తల్లిదండ్రులు తిరుపతిరావు,నీలమ్మలు గుండెలవిసేలా రోదించారు. స్వగ్రామం కిల్లాడలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.

147 కేజీల గంజాయి స్వాధీనం

పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

విజయనగరం క్రైమ్‌: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు. గడిచిన వారం రోజుల్లో భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్సీ వకుల్‌ జిందల్‌ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా 147కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చూపించారు. గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలానికి చెందిన బోగవిల్లి గోవిందరావు, సాగుపిల్లి అనిల్‌ కుమార్‌, బంక రామసురేష్‌, అంబిడి బాలరాజులు రామభద్రపురం మండలంలోని కొట్టక్కి జంక్షన్‌ వద్ద గంజాయి విక్రయానికి పాల్పడుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో రామభద్రపురం పోలీసులు, ఆ నలుగురు నిందితులను అదుపులోకి ప్రశ్నించడంతో గంజాయి సరఫరా గుట్టు రట్టైందని ఎస్పీ చెప్పారు. దీంతో నిందితుల దగ్గర ఉన్న 147 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

వంశధార నది దాటిన  జంట ఏనుగులు1
1/2

వంశధార నది దాటిన జంట ఏనుగులు

వంశధార నది దాటిన  జంట ఏనుగులు2
2/2

వంశధార నది దాటిన జంట ఏనుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement