జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి కాట్రగుడ గ్రామంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో వంట గ్యాస్ లీకై ంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సిలిండర్లను బయటకు తీసి ప్రమాదాన్ని తప్పించారు. ప్రమాదంలో ఫాస్ట్‌ఫుడ్ కేంద్రం యజమాని సుశాంత్ తీవ్రంగా గాయ పడ్డారు.
కత్తి చూపి
గొలుసు దొంగతనం
జయపురం: జయపురంలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు స్నాచర్లు ఇద్దరు మహిళలను కత్తితో బెదిరించి మెడలో ఉన్న బంగారు గొలుసులను తెంపుకు పోయారని ఫిర్యాదులు అందయాని స్థానిక పోలీసులు సోమవారం తెలిపారు. ఎంజీ రోడ్డు నివాసులు జి.రమణమ్మ, ఆమె స్నేహితురాలు పి.హేమ సోమవారం ఉదయం వాకింగ్ కోసం పూర్ణాఘడ్‌లో దక్షిణ కాళీ మందిరం వెళ్తుండగా ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి వారికి కత్తితో బెదిరించి వారి మెడలలో ఉన్న బంగారు గొలుసులు దోచుకు పోయారు. దుండగులు ఏనుగుల శాల వైపు వెళ్లిపోయినట్టు బాధితులు పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రోగ నిర్ధారణ మిషన్ కోసం ఆర్థిక సాయం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో సికిల్ సెల్ అనీమియా, క్షయ రోగ నిర్ధారణ స్క్రీనింగ్ కోసం నవరత్న కంపెనీ నాల్కో ఫౌండేషన్ వారు సోమవారం కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ కు 1కోటి 24లక్షల 70వేలు చెక్కును అందజేశారు. ఈ సాయంతో అతి త్వరలోనే వ్యాధి నిర్ధారణ మిషన్‌ను తీసుకువస్తామని తెలిపారు.
బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి పూజారిగుడ పంచాయతీ బాసినీగుడలో గల సహిద్ లక్ష్మణ నాయక్ డిగ్రీ కళాశాలలో వేసవి శిబిరం ఆదివారం ప్రారంభించారు. ఈ క్యాంపులో బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ రాజేష్ మహురియ రాష్ట్ర పురస్కార గ్రహీత స్వచ్ఛంద సేవకులు సంతోష్ కుమార్‌లు పాల్గొని బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను వివరించారు.
పైపులు చోరీ చేసిన ఇద్దరి అరెస్టు
మల్కన్‌గిరి: వుల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి వెంకటపాలెం గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న మెగా మంచినీటి ప్రాజెక్ట్ నుంచి ఇనుప పైపులను ఆదివారం రాత్రి చోరీ చేసిన ఇద్దరిని గ్రామస్తులు పట్టుకొని కలిమెల పోలీసులకు అప్పగించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో కూఢ ఎండీవీ 8 గ్రామానికి చెందిన దేవబ్రత హాల్దార్, ఎంపీవీ 17 గ్రామానికి చెందిన అమిత్ మండాళ్ ఉన్నారన్నారు. కలిమెల ఐఐసీ చంద్రకాంత్ తండి వీరిపై కేసు నమోదు సోమవారం కోర్టులో హాజరు పరిచారు.
ఆదిత్యుని హుండీ
కానుకల లెక్కింపు నేడు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆల య హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ మంగళవా రం ఉదయం 8 గంటల నుంచి అనివెట్టి మండపంలోనిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈఓ వై.భద్రాజీ ప్రక టనలో తెలియజేశారు. ఈమేరకు నిబంధనల ప్రకా రంగ్రామపెద్దలు, ఆలయ పాలకమండలి సభ్యులు, అఽధికారులు, ప్రధానార్చకులు సమక్షంలో హుండీ లను తెరిపించి లెక్కింపును చేపడతామని ఆయన వివరించారు.
ఫాస్ట్‌ఫుడ్ దుకాణంలో సిలిండర్ లీక్
ఫాస్ట్‌ఫుడ్ దుకాణంలో సిలిండర్ లీక్
ఫాస్ట్‌ఫుడ్ దుకాణంలో సిలిండర్ లీక్