పర్లాకిమిడి: గుసాని సమితి ఏడోమైలు జంక్షన్ వద్ద చైన్‌స్నాచింగ్ జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో మూడు తులాల బంగారం చైన్‌ను తెంచుకొని పరారయ్యారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏడో మైలు వద్ద బుసుకిడి పంచాయతీకి చెందిన మజ్జి బైరాగి మాస్టార్.. ఆయన భార్య ఎం.జానకమ్మ స్కూటీపై పర్లాకిమిడి మెడికల్‌కు వచ్చి పనులు ముగించుకుని తిరిగి వెళ్తున్నారు. ఏడోమైలు సమీపంలో ముఖానికి మాస్క్ వేసుకుని వెనుకనుంచి వచ్చిన ఇద్దరు దుండగులు మజ్జి జానకమ్మ మెడలోని బంగారు గొలుసును లాక్కుని రాయగడ వైపు పారిపోయినట్టు బాధితురాలు విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూటీ పైనుంచి దంపతులిద్దరూ రోడ్డు మీద పడిపోయారు. గురండి పోలీసు ఐఐసీ ఓం నారాయణ పాత్రో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడో మైలు జంక్షన్ వద్ద తరచూ చైన్ స్నాచింగ్ సంఘటనలు జరుగుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు.
ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయండి
కొరాపుట్: తమ గ్రామంలో తక్షణం ట్రాన్స్‌ఫారం ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. కొరాపుట్ జిల్లా సునాబెడాలోని విద్యుత్ శాఖ కార్యాలయానికి సోమవారం సిమిలిగుడ సమితి రాజ్‌పుట్ గ్రామ పంచాయతీ చలాన్‌పుట్ గ్రామస్తులు తరలివచ్చారు. తమ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందని అధికారులు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. స్పందించిన విద్యుత్ ఽశాఖ అధికారులు మూడు రోజులలో ట్రాన్స్‌ఫారం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
యువకుడు ఆత్మహత్య
కొరాపుట్: గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కొట్ సమితి దండసోర్ గ్రామ సమీపంలోని అడవుల్లోని చెట్టుకు యువకుడి మృతదేహం వేలాడుతూ ఉండటాన్ని అటుగా వెళ్లిన గిరిజనులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలు
మల్కన్‌గిరి: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడ్డడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి కేంద్రం గోజియాగూడ గ్రామం వద్ద సోమవారం చోటుచేసుకుంది. గాయపడిన వారిని చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చిత్రకొండ సమితి బోడఫోదర్ పంచాయతీ రేఖపల్లి గయరామం గ్రామానికి చెందిన జమున ఖరా, కలిమెల సమితికి చెందిన నీలాంఛల్ సాహులు వాహనాలతో ఢీకొట్టుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు గాయపడడంతో ప్రాథమిక వైద్యం అనంతరం నీలాంచల్‌ను మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చిత్రకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు ్త చేస్తున్నారు.
గుసాని సమితిలో చైన్ స్నాచింగ్
గుసాని సమితిలో చైన్ స్నాచింగ్