జయపురం: దేశ విముక్తి కోసం ప్రాణాలను చిరు నవ్వుతో అర్పించిన విప్లవ వీరులు సహిద్ భగత్ సింగ్, శుఖ్‌దేవ్, రాజగురు నిజమైన దేశ భక్తులని వక్తులు అన్నారు. స్థానిక యాదవ భవనంలో ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి అధ్యక్షతన భగత్ సింగ్, శుఖ్‌దేవ్, రాజగురు వర్ధంతిని నిర్వహించారు. భగత్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భగత్ సింగ్, శుఖ్‌దేవ్, రాజగురు చిత్రపటాలకు నివాళులర్పించారు. కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్, ప్రమోద్ కుమార్ తివారీ, అలేక్ పాత్రో, కె.సత్యనారాయణ పాల్గొన్నారు.