విజయనగరం అర్బన్: ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక పూర్తిగా తప్పులతో కూడినదని అంబేడ్కర్ ఫోరం ఏపీ అధ్యక్షుడు భానుమూర్తి ఆరోపించారు. దీనిని పరిశీలించాలని రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ కలెక్టర్‌లోని డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తికి శనివారం వినతిపత్రాన్ని అందజేశారు. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ సెక్షన్ 11 ప్రకారం కమిషన్‌ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 (1)(2) సవరించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందన్నారు. డీఆర్వోను కలిసిన వారిలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొంగ భానుమూర్తి, దారాన వెంకటేష్, మల్లాన సత్యనారాయణ, రెల్లి, ఉపకులాల అధ్యక్షుడు సోము మురళీమోహన్ ఉన్నారు.
రాష్ట్ర గవర్నర్‌కు అంబేడ్కర్ ఫోరం
రాష్ట్ర కమిటీ ఫిర్యాదు