పర్లాకిమిడి: గ్రామాల్లో అభివృద్ధి కానరావడం లేదని సీపీఐ ఎంఎల్ నాయకులు అన్నారు. గజపతి జిల్లా నువాగడ బ్లాక్ అనుగురు పంచాయతీ పెట్టగుడ గ్రామంలో స్వాతంత్య్రం వచ్చి నేటికి 76 సంవంత్సరాలు గడిచినా అభివృద్ధ కానరాలేదని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి గోమంగో అన్నారు. శుక్రవారం ఆయన పెట్టగుడ గ్రామంలో ఆదివాసీ సభ నిర్వహించి ప్రజలతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం వేతనదారులకు రోజుకు రూ.600 ఇవ్వాలని, జాబ్‌కార్డులు మంజూరు చేయాలని, పింఛన్ నెలకు రూ.5 వేలు, మంచినీరు, విప్పపువ్వు మద్దతు ధర కిలో రూ.100, మొక్కజొన్న కిలోకి రూ.200 ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు. అలాగే జయపూర్ మకిండి కెందునల్లా, అంబాఝరి, నువాసాహి వద్ద చెక్‌డ్యాంలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పెట్టగుడ నుంచి కెడిపదర్, మాణిక్ పూర్, జయపూర్‌కు పక్కారోడ్డు నిర్మించాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే నువాగడ తహీల్దార్, బ్లాక్ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని తిరుపతి గోమాంగో అన్నారు. కార్యక్రమంలో కర్నియల్ గోమాంగో, మాథ్యూ రయితో, సైడ్రిక్ మల్లిక్, మయిజో మజ్జి, జయామజ్జి, జోహాన్ రయితో, రాజేంద్ర మఝి పాల్గొన్నారు.