పర్లాకిమిడి: మనిషి మేధాశక్తిని సాంకేతికతతో రూపాంతరం చేసి కృత్రిమ మేధను సృష్టించడం ఈనాటి ప్రపంచంలో చూడగలుగుతున్నామని, ఐఐటీ, భుభనేశ్వర్ ప్రొఫెసర్ భరతం రామ్‌కుమార్ అన్నారు. స్థానిక ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్శిటీ ఓపెన్ ఆడిటోరియంలో ప్రథమ అంతర్జాతీయ సమావేశానికి ప్రొఫెసర్ భరతం రామ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సమావేశానికి గౌరవ అతిథులుగా భువనేశ్వర్ నుంచి శిక్షా ఓ అనుసంధాన్ డీమ్డ్ వర్సిటీ అధ్యాపకులు మిహిర్ ఎన్.మహంతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆశిష్ రందజన్ దాస్, ప్రొఫెసర్ సుజాతా చక్రవర్తి, సెంచూరియన్ వీసీ ప్రొఫెసర్ సుప్రియా పట్నాయిక్, రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రోలు విచ్చేయగా సమావేశ కన్వీనరు ప్రొఫెసర్ అశోక్ మిశ్రా తన స్వాగత ప్రసంగంలో అతిథులను ఆహ్వానించారు. దేశ, అంతర్జాతీయ నిపుణులు, పరిశోధకుల నుంచి 140 థీసిస్ పేపర్లు రాగా, వాటిలో 40 ప్రెజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా మెడా– 2025, మెషీన్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌పై ఒక సావనీర్‌ను గౌరవ అతిథులు ఆవిష్కరించారు. కృత్రిమ మేధాశక్తితో మెషీన్ ఇంటెలిజెన్సు, డాటా సైన్స్ అనుసంధానం చేసి ఫ్యాక్టరీలు, రైల్వే కోచ్‌లు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉపయోగిస్తున్నారని ప్రొఫెసర్ భరతం రాంకుమార్ తన ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ అంతర్జాతీయ సెమినార్ మెడా–25కు వర్చువల్ విధానంలో ప్రొఫెసర్ విన్‌సెంజో పియురీ (ఇటలీ), లక్కీశర్మ (జీకోన్ నెట్‌వర్క్), ప్రొఫెసర్ స్వగతం దాస్ (కోల్‌కోత్తా), నేహాశర్మ, ఫ్రోసెలస్టియన్ వెండీ (యు.కె.)లు హాజరయ్యారు.
కృత్రిమ మేధ ఈ తరం అద్భుతం
కృత్రిమ మేధ ఈ తరం అద్భుతం
కృత్రిమ మేధ ఈ తరం అద్భుతం