చైన్నె చేరిన బీజేడీ, కాంగ్రెస్‌ నాయకులు | - | Sakshi
Sakshi News home page

చైన్నె చేరిన బీజేడీ, కాంగ్రెస్‌ నాయకులు

Published Sat, Mar 22 2025 1:41 AM | Last Updated on Sat, Mar 22 2025 1:41 AM

భువనేశ్వర్‌: ప్రతిపాదిత పునర్విభజనపై చైన్నెలో జరగనున్న సమావేశానికి హాజరయ్యేందుకు రాష్ట్రం నుంచి బిజూ జనతా దళ్‌, కాంగ్రెస్‌ నాయకులు బయల్దేరారు. శుక్రవారం సాయంత్రం వీరంతా చైన్నె చేరారు. బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ నిర్ణయం మేరకు ఆ పార్టీకి చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు అమర్‌ పట్నాయక్‌, మాజీ ఎమ్మెల్యే సంజయ్‌ దాస్‌ బర్మ ప్రాతినిథ్యం వహించారు. ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్‌ దాస్‌ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. పునర్విభజన సాహసోపేతమైన రాజకీయ చర్యలో భాగంగా రాజకీయ శిబిరాల్లో చర్చ సాగుతుంది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక దళాలు శనివారం చైన్నెలో జరగనున్న డీలిమిటేషన్‌పై కీలకమైన సమావేశానికి హాజరు అవుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం బీజేడీ తన వైఖరిని ఈ సమావేశంలో వ్యక్తీకరిస్తుందని ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కేవలం జనాభా గణాంకాల ఆధారంగా ఉంటే రాష్ట్రంపై పునర్విభజన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఈ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో చర్చ ఆధారంగా రాష్ట్రంపై పునర్విభజన ప్రభావం స్పష్టం కానుందని సంజయ్‌ దాస్‌ బర్మ తెలిపారు. తదనంతరం బీజేడీ వైఖరి స్పష్టం అవుతుందన్నారు. ఒడిశా, పంజాబ్‌, బెంగాల్‌ సహా ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన నాయకత్వ ప్రతినిధి బృందం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆతిథ్యం ఇచ్చే కార్యక్రమంలో సమావేశమవుతుందని సమాచారం. ఈ ఉన్నత స్థాయి సమావేశం వివాదాస్పద పునర్విభజనతో ప్రాంతీయ సమస్యలను చర్చిస్తుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement