గేట్‌లో ఆలిండియా 451వ ర్యాంక్‌ ● అర్తమూరు యువకుడి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

గేట్‌లో ఆలిండియా 451వ ర్యాంక్‌ ● అర్తమూరు యువకుడి ప్రతిభ

Published Fri, Mar 21 2025 12:49 AM | Last Updated on Fri, Mar 21 2025 12:48 AM

చీపురుపల్లి రూరల్‌

(గరివిడి): ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిర్వహించిన గేట్‌–2025 (గ్రాడ్యుయేట్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)ఎంట్రన్స్‌ టెస్ట్‌లో గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన యువకు డు సుంకరి నరసింహనాయుడు ప్రతిభ చాటా డు. మెకానికల్‌ విబాగంలో ఆలిండియా స్థా యిలో 451వ ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న గేట్‌ ఎంట్రన్‌ పరీక్ష జరగ్గా బుధవారం ఫలితాలు విడుదలయ్యాయి.

తల్లిదండ్రుల చెంతకు

తప్పిపోయిన బాలుడు

గరుగుబిల్లి: మండలంలోని రావివలస ఎస్సీ వసతి గృహంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి పత్తిగూల శివసాయిని స్థానిక ఎస్సై పి.రమేష్‌నాయుడు గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శివసాయి ఫిబ్రవరి 17న రావివలస ఎస్సీ వసతి గృహంనుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు తండ్రి పోలయ్య ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివసాయి కోసం గాలింపు చేపట్టగా సీతానగరం మండలం అంటిపేటవద్ద ఆచూకీ లభించడంతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి, తల్లిదండ్రులకు ఎస్సై అప్పగించారు. ఈ సందర్భింగా తల్లిదండ్రులు ఎస్సైకి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈహెచ్‌ఎస్‌ సేవలందించడంలో అలసత్వం తగదు

ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్‌ డి.రాంబాబు

విజయనగరం ఫోర్ట్‌: ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌)కు సంబంధించి ప్రతి రోగికి వైద్యసేవలు అందించాలి. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్‌ వైద్యసేవ) జిల్లా మేనేజర్‌ డి.రాంబాబు అన్నారు. ఈ మేరకు పట్టణంలోని శ్రీసాయి సూపర్‌ స్పెషాలిటీ నెట్‌వర్క్‌ ఆస్పత్రిని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్యసేవల గురించి ఆరా తీశారు. చికిత్స సకాలంలో అందిస్తున్నారా? నాణ్యమైన భోజనం పెడుతున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదనంగా డబ్బులు ఏమైనా అడుతున్నారా అని రోగులను ఆరా తీశారు. ఆస్పత్రిలో ఏ సమస్య ఉన్నా వెంటనే ఆరోగ్య మిత్రను కలవాలని రోగులకు చెప్పారు. కార్యక్రమంలో టీమ్‌ లీడర్‌ ఎ.భానుప్రసాద్‌ పాల్గొన్నారు.

అట్రాసిటి కేసుపై విచారణ

వేపాడ: మండలంలోని గుడివాడ గ్రామానికి సంబంధించి నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుపై విజయనగరం డీఎస్పీ మీరాకుమార్‌ నేతృత్వంలో గురువారం విచారణ చేపట్టారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. మార్చి 11న గుడివాడలో వేణుగోపాలస్వామి తీర్థం సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్‌బేబీ డ్యాన్స్‌ వద్ద జరిగిన గొడవలో తన కుమారుడిని కులం పేరుతో వల్లంపూడి ఎస్సై బి.దేవి దూషించి గాయపర్చినట్లు గ్రామానికి చెందిన గుడివాడ కృష్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ పి.మీరాకుమార్‌, రూరల్‌ సీఐ అప్పలనాయుడు గ్రామంలో గురువారం విచారణ నిమిత్తం గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ వద్దకు ఫిర్యాదుదారు కృష్ణమ్మ హాజరుకాకపోవడంతో డీఎస్పీ మీరాకుమార్‌ ఫిర్యాదు దారు ఇంటికి వెళ్లి ఆరా తీయగా కుటుంబసభ్యులు ఉన్నారు కానీ ఫిర్యాదుదారు లేకపోవడంతో గ్రామసభకు చేరుకున్నారు. గ్రామసభలో వేచి ఉన్నప్పటికీ సాక్షులు హాజరుకాకపోవడంతో సర్పంచ్‌ మిడతాన గోపి, ఏపీ దళితకూలీ రైతు సంఘం నాయకుడు గాలి ఈశ్వర్రావు తదితరులతో మాట్లాడిన అనంతరం డీఎస్పీ, సీఐ వెనుదిరిగారు.

మారిక హెచ్‌ఎం సస్పెన్షన్‌

వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీ శివారు గిరి శిఖరంపై ఉన్న మారిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్‌వీ శ్రీకాంత్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యాలనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు సక్రమంగా హాజరు కావడం లేదని అందిన ఫిర్యాదుల మేరకు ఎంఈఓతో విచారణ నిర్వహించారు. అనంతరం సస్పెండ్‌ చేస్తూ డీఈఓ ఆదేశాలు ఇచ్చారు.

గేట్‌లో ఆలిండియా 451వ ర్యాంక్‌ ● అర్తమూరు యువకుడి ప్రతి1
1/3

గేట్‌లో ఆలిండియా 451వ ర్యాంక్‌ ● అర్తమూరు యువకుడి ప్రతి

గేట్‌లో ఆలిండియా 451వ ర్యాంక్‌ ● అర్తమూరు యువకుడి ప్రతి2
2/3

గేట్‌లో ఆలిండియా 451వ ర్యాంక్‌ ● అర్తమూరు యువకుడి ప్రతి

గేట్‌లో ఆలిండియా 451వ ర్యాంక్‌ ● అర్తమూరు యువకుడి ప్రతి3
3/3

గేట్‌లో ఆలిండియా 451వ ర్యాంక్‌ ● అర్తమూరు యువకుడి ప్రతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement