● గిరిజనుల హర్షం
● కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపిన
గ్రామస్తులు
వేపాడ: గిరిశిఖర మారిక గ్రామ గిరిజనుల దశాబ్దాల పోరాటం సఫలీకృతం కావడంతో మారిక రోడ్డు నిర్మాణం చురుగ్గా సాగుతోందని సీపీఎం జిల్లా నాయకుడు చల్లా జగన్ అన్నారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మారిక తండాలో రెండురోజులు బస చేసిన నాయకులు బుధవారం మారిక సమీపంలో జరుగుతున్న రోడ్డు పనుల వద్దకు చేరుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మారిక గిరిజన గ్రామానికి రోడ్డు కావాలని, స్వాతంత్య్ర ఫలాలు గిరిజనులకు అందాలంటూ 2013, 2017, 2021,2025 సంవత్సరాల్లో రోడ్డుకోసం ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి, వంటావార్పు, కార్యాలయ నిర్బంధం లాంటి పోరాటాల్లో యువత, మహిళలు, పెద్దలు పోరాడి నందున ఆ ఫలితంగా నేడు రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ జాతీయ ఉపాధిహామీ పథంకం నిధులు రూ.7కోట్లు కేటాయించటమే కాకుండా రోడ్డు నిర్మాణంపై చొరవ చూపించారంటూ కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ సమస్య పరిష్కారంలో స్థానిక ప్రజాప్రతినిధులు కృషిచేయడంతో పాటు గతంలో ఆసంపూర్తిగా నిలిచిన రోడ్డుపనులు, కొత్తగా మంజూరైన రోడ్డు పనులు ఒకేసారి చేపట్టడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాలకులు మరింత చొరవచూపి వర్షాకాలంనాటికి రోడ్డునిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు చలుమూరి శ్యామ్ మారిక పెద్దలు కిలోఆనంద్, గమ్మెల రామకృష్ణ, బాబారావు, అప్పలనాయుడు, అసు, ఆర్జున్, వెంకటరావు,లింగరాజు, కృష్ణ, శ్రీను మహిళలు పాల్గొన్నారు.
మారిక రోడ్డుకు మోక్షం