
11 ఎకరాల్లో గంజాయి ధ్వంసం
పర్లాకిమిడి: గజపతి జిల్లా అడవ పీఎస్ పరిధి గులుబ పంచాయతీలో కప్పిలి, కజ్జు ఏజెన్సీలో అక్రమంగా పండిస్తున్న పదకొండు ఎకరాల్లోని గంజాయి పంటను పోలీసులు, ఎకై ్సజు శాఖ బృందం గాలించి ధ్వంసం చేశారు. రాత్రి అందిన సమాచారం మేరకు గులుబ పంచాయతీలోని కప్పిలి ఏజెన్సీలో 22వేల గంజాయి మొక్కలను నాశనం చేశారు. వీటి విలువ మార్కెట్‌లో రూ. 2 కోట్లు ఉంటుందని మోహన పోలీసు అధికారి బసంత్ కుమార్ శెఠి తెలియజేశారు. ఎస్పీ జితేంద్ర కుమార్ పండా ఆదేశాల మేరకు గత రెండు నెలలుగా క్లీన్, గ్రీన్ గజపతి ఆపరేషన్‌లో భాగంగా పలు చోట్ల గంజాయి సాగును అరికడుతున్నారు.

11 ఎకరాల్లో గంజాయి ధ్వంసం