ప్రతిరోజూ నాకు నమస్కారం చేయండి.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిరోజూ నాకు నమస్కారం చేయండి..

Aug 23 2023 1:30 AM | Updated on Aug 23 2023 10:03 AM

- - Sakshi

తనకు ప్రతిరోజూ ఆఫీస్‌కు వచ్చిన వెంటనే సిబ్బంది మొత్తం నమస్కారం చేయడం లేదని, కొంతమంది గుడ్‌ మార్నింగ్‌తో సరిపెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒడిశా: ప్రతిరోజూ నాకు నమస్కారం చేయండి.. లేదంటే మీ పనులు నిలిపివేస్తాను అని ఒక మహిళా అధికారి తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో బిసంటక్‌ సమితి పరిధిలోని జీవికా మిషన్‌ కార్యాలయంలో మానసీ టకిరి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తనకు ప్రతిరోజూ ఆఫీస్‌కు వచ్చిన వెంటనే సిబ్బంది మొత్తం నమస్కారం చేయడం లేదని, కొంతమంది గుడ్‌ మార్నింగ్‌తో సరిపెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపై అలాంటివి కొనసాగవని, అందరు తప్పకుండా నమస్కారం చేయాల్సిందేనని గట్టిగా చెప్పారు. అయితే ప్రతిరోజూ గుడ్‌ మార్నింగ్‌ చెబుతున్నాం కదా మేడం అని ఒక వ్యక్తి అంటున్నా ఆమె ససేమిరా అన్నారు. ఈ వీడియోను బిసంకటక్‌ బీడీవో సదాశివ నాయక్‌ దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా, దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement