పెళ్లి గొడవ... తల్లి ఆత్మహత్య.. కుమార్తె సాయిలీల ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పెళ్లి గొడవ... తల్లి ఆత్మహత్య.. కుమార్తె సాయిలీల ఆత్మహత్యాయత్నం

Jul 4 2023 8:30 AM | Updated on Jul 4 2023 8:39 AM

- - Sakshi

గాంధీనగర్‌ కాలనీకి యువతి బొట్టా సాయిలీల హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తోంది.

నెల్లిమర్ల రూరల్‌: నగర పంచాయతీ పరిధిలోని గాంధీనగర్‌ కాలనీకి చెందిన మహిళ వ్యక్తిగత కారణాలతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో విషయం తెలుసుకున్న మృతురాలి కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీనగర్‌ కాలనీకి యువతి బొట్టా సాయిలీల హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తోంది.

తాను ఓ వ్యక్తిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఇటీవల ఆమె ఇంట్లో చెప్పింది. తల్లి సత్యవతి(45)కి ఈ విషయం నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. దీంతో తల్లి సత్యవతి సమీపంలోని రైల్వేట్రాక్‌ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు రైల్వేట్రాక్‌పై ఉన్న మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు.

కాగా తల్లి ఆత్మహత్య చేసుకుందని విషయం తెలుసుకున్న కుమార్తె మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న సాయిలీలను చికిత్స నిమిత్తం స్థానిక మిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement