కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఘనస్వాగతం | - | Sakshi
Sakshi News home page

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఘనస్వాగతం

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఘనస్వాగతం

విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో సోమవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ఘనస్వాగతం లభించింది. విజయవాడ పర్యటన నిమిత్తం ఆయన పుణే నుంచి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో సాయంత్రం 4.55 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో అమిత్‌షాకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, డీజీపీ హరిష్‌కుమార్‌ గుప్తా, ఏలూరు రేంజ్‌ ఐజీ జి.వి.జి.అశోక్‌కుమార్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ, ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ టి.మోహన్‌రావు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం హోం మంత్రి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ బయలుదేరి వెళ్లారు. అక్కడ కార్యక్రమం అనంతరం రాత్రి 9.10నిమిషాలకు ఇక్కడకు చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమై వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement